BigTV English

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కి అనుకూలంగా బీబీసీ వార్తలు? బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కి అనుకూలంగా బీబీసీ వార్తలు? బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  దాయాది దేశంపై భారత్ ఆంక్షలు విధించింది. ఇందులోభాగంగా ఇండియాకి వచ్చిన పాకిస్థానీయుల లాంగ్ టర్న్ వీసాల గడువు నేటితో ముగియనుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో ఎంత మంది పాక్ జాతీయులు ఉన్నారు, ఆయా వివరాలను వెల్లడిస్తున్నారు.


హెల్త్ వీసాపై వచ్చినవారికి అదనంగా మరో రెండు రోజులు (ఏప్రిల్ 29వరకు) సమయం ఇచ్చింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అయితే ఈ వ్యవహారంలో బీబీసీ మాత్రం పాకిస్థాన్‌కు అనుకూలంగా వార్తలు వస్తుందని అంటున్నారు చాలామంది.

బీబీసీపై ఆగ్రహం, ఎందుకు?


ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనను బయటపెడుతున్నారు. పాకిస్థాన్ పర్యాటకులను భారత్ చంపినట్టు బీబీసీ రాస్తుందని మండిపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో బీబీసీని నిషేధించాలనే వాదన క్రమంగా పెరుగుతోంది. ఇదేకాదు చాలా విషయాల్లో బీబీసీ ఇలాగే చేసిందని అంటున్నారు.  ఉగ్రదాడి తర్వాత  భారత్-పాకిస్థాన్ మధ్యఏం జరిగింది.. జరుగుతుందో యావత్త ప్రపంచానికి తెలుసు.

పహల్‌గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్‌లో అన్నివర్గాల ప్రజల నుంచి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.  దాయాది దేశానికి చెందిన ముఖ్యనేతలు రోజుకో ప్రకటనపై చేయడంపైనా మండిపడుతున్నారు. ప్రతీరోజూ మృతి చెందిన అమరవీరులకు నివాళులు, క్యాండిల్ ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ఆందోళనను గమనించిన మోదీ సర్కార్ వెంటనే చర్యలు చేపడుతోంది కూడా.

ALSO READ: మళ్లీ దాడి చేసి ఉగ్రవాదులు, కాశ్మీర్ లో సామాజిక కార్యర్త హత్య

భారత్ నుంచి పాకిస్తానీయులు ఒకొక్కరుగా సరిహద్దు దాటి వెళ్లిపోతున్నారు. అలాగే దాయాది దేశంలోఉన్న భారతీయులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.  ఆదివారం సాయంత్రం నాటికి భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు వెళ్లపోవడం ఖాయం. ఇలా పాకిస్థాన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తోంది భారత్. సిందు జలాల ఒప్పందాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

గాలింపులు తీవ్రతరం

ఇదిలావుండగా జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు కీలక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్‌లో 100కి పైగా టెర్రరిస్టులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిఘా పెంచడంతోపాటు గాలింపు మొదలుపెట్టాయి భద్రతా బలగాలు.

తాజాగా లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి బలగాలు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్, బందిపొరాలో అహ్మద్ షీర్, అమీర్ నాజిర్ ఇళ్లను ధ్వంసం చేసినట్టు బలగాలు వెల్లడించాయి. మరోవైపు పహల్‌గామ్ దాడి కేసును ఎన్ఐఏ( NIA)కి అప్పగించింది కేంద్రం.  ప్రభుత్వం ఆదేశాలతో ఆ విభాగానికి చెందిన అధికారులు రంగంలోకి దిగేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×