E-Paper
Advertisement

Samantha : ఫ్యాన్స్ కు బిగ్‌ షాక్‌.. సినిమాలకు సమంత లాంగ్ బ్రేక్..

Samantha : ఫ్యాన్స్ కు బిగ్‌ షాక్‌.. సినిమాలకు సమంత లాంగ్ బ్రేక్..
Advertisement

Samantha latest news(Tollywood Celebrity News): టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వబోతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆ మధ్య సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఎంతో ఆత్మస్థైరంతో వ్యాధితో పోరాడింది. తిరిగి కోలుకున్న తర్వాత సమంత సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టింది. అయితే సామ్ కు కాలం కలిసిరాలేదు. ఆమె నటించిన శాకుంతలం విజయం సాధించలేదు.

శాకుంతలం మూవీ తర్వాత సామ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ నడుస్తోంది. ఈ వారంలోనే షూటింగ్ పూర్తవుతుందని హీరో విజయ్ దేవరకొండ తాజా ప్రకటించాడు. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలకానుంది. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.

Advertisement

సమంత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తైన తర్వాత బ్రేక్ తీసుకోవాలనుకుంటోదని టాలీవుడ్ టాక్. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని సామ్ ఆలోచిస్తోందట. అందుకే కొంతకాలం విరామం తీసుకోవాలనుకుంటుందని అంటున్నారు. గతంలో అంగీకరించిన ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్సులను తిరిగి నిర్మాతలకు ఇచ్చేసిందని తెలుస్తోంది.

ఇక వచ్చే ఏడాది తర్వాతే ఆమె తిరిగి సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఈ లోపు ఖుషి మూవీ ప్రమోషన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. సామ్ బ్రేక్ తీసుకోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు సమంత ప్రేమలో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆ విషయాలపై సమంతనే పూర్తి క్లారిటీ ఇవ్వాలి.

Advertisement


Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×