Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సమంత(Samantha) అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తూనే, మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తన భర్త నాగచైతన్య (Naga Chaitanya) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ‘అమ్మ చెప్పింది’ అంటూ ఇన్ స్టా ప్లాట్ఫారం వేదికగా తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను తరచూ షేర్ చేస్తూ ఉండేది సమంత. అయితే ఇప్పుడు కూడా ప్రేమను ఉద్దేశించి, తాజాగా పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
సాషా లాంటి ప్రేమ దొరకదు..
తన పెంపుడు శునకం అయినా సాషా తో దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ..” సాషా ప్రేమ మాదిరిగా మరొక ప్రేమ లేదు దొరకదు” అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇది కాస్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది దీన్ని బట్టి చూస్తే సమంత స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురుచూస్తోంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నాగచైతన్య నుంచి ఆ ప్రేమ దొరకక పోవడం వల్లే ఆమె విడాకులు తీసుకుందని కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా సమంత మాత్రం జీవితంలో ఒంటరి అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కూడా దూరం అయ్యాడు. దీనికి తోడు కన్న తండ్రి కూడా ఇటీవలే స్వర్గస్తులవడంతో ఒంటరి అయిపోయిన సమంత.. ఇలా పెంపుడు శనకం ద్వారా ప్రేమను పొందుతున్నట్లు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సమంతా మానసికంగా రికవరీ అవ్వాలని, తనను తాను మరింత బలం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
సమంత కెరియర్..
ఇక సమంత విషయానికి వస్తే.. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న ఈమె.. ఆ సమయంలో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు సెకండ్ హ్యాండ్ అంటూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. దీనికి తోడు మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకుంది. అంతేకాదు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది సమంత. ఇందులో యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. మరోవైపు నిర్మాతగా మారి ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని కూడా నిర్మిస్తోంది సమంత. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమా అయితే ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. ఇక ఈ సినిమా స్టేటస్ ఏంటో కూడా తెలియదనే చెప్పాలి. ఇక ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కావాలి అంటూ పోస్ట్ పెట్టడంతో అందరూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.