Pushpa 2 : ‘పుష్ప 2’ నిర్మాతలకు రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతుంది. తాజాగా ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ పోషించిన పాత్ర ‘షెకావత్’ పేరును తొలగించకపోతే, ఇంటికి వచ్చి కొడతామంటూ నిర్మాతలను హెచ్చరించారు కర్ణి సేన.
రాజ్ పుత్ సంఘం నాయకుడు రాజ్ షెకావత్ ‘పుష్ప 2′ (Pushpa 2) సినిమా క్షత్రియ సమాజాన్ని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ, నిర్మాతలను బెదిరించడం సంచలనంగా మారింది. ఈ మేరకు ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ “పుష్ప 2 చిత్రంలో షెకావత్’ పాత్ర నెగిటివ్ గా ఉంది. పైగా అది క్షత్రియులను అవమానించేలా ఉంది. ఈ సినిమా నిర్మాతలను కొట్టడానికి కర్ణి సేన సిద్ధంగా ఉండండి” అంటూ కర్ని సేనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘పుష్ప 2’ మూవీలో ఫహద్ ఫాజిల్ బన్వర్ సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
అయితే అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందంటే… ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలో ‘షెకావత్’ అనే పదాన్ని పదేపదే అవమానించడం జరిగిందని, అది క్షత్రియ సమాజాన్ని అవమానించడమే అవుతుందని ఆరోపిస్తోంది కర్ణి సేన. అంతేకాకుండా ఆ పదాన్ని సినిమా నుంచి తొలగించాలని మేకర్స్ ను డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా క్షత్రియులను ఘోరంగా అవమానించిందని, షెకావత్ కమ్యూనిటీని హీనంగా సినిమాలో ప్రదర్శించారని, వాక్ స్వాతంత్రం పేరుతో ఈ సినిమా లో క్షత్రియులను ఇంత దారుణంగా చూపించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. సినిమా నిర్మాతలు ‘పుష్ప 2’ నుంచి షెకావత్ అనే పదాన్ని తీసేయాలని, లేదంటే వాళ్ళను ఇంటికి వచ్చి మరీ కర్ణి సేన కొడుతుందని, అవసరం అనుకుంటే అన్ని లిమిట్స్ దాటుతామని రాజ్ షెకావత్ హెచ్చరించారు. మరి ఈ వివాదంపై ‘పుష్ప 2’ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
पुष्पा 2 फ़िल्म मे “शेखावत” का नेगेटिव किरदार, फिर से क्षत्रियों का अपमान, तैयार रहे करणी सैनिक, जल्द फ़िल्म निर्माता की ठुकाई की जाएगी। @aajtak @ABPNews @ZeeNews @VtvGujarati @BBCBreaking @CNNnews18 @timesofindia @TimesNow @htTweets @EconomicTimes @FinancialTimes @JagranNews… pic.twitter.com/vsbm2r3OLL
— Dr. Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) December 8, 2024
ఎన్నో అడ్డంకులను దాటుకొని మూడేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ. రిలీజ్ కి ముందే ‘పుష్ప 2’ మేకర్స్ కి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక రిలీజ్ అవుతున్న టైంలో కూడా మెగా ఫాన్స్ నుంచి హెచ్చరికలు, నెగిటివిటీ గట్టిగానే వచ్చింది. ఇవన్నీ చాలవు అన్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ వివాదం కూడా నడిచింది. అవన్నీ దాటుకుని ముందుకెళ్తే టిక్కెట్ ధరలపై విమర్శలు వినిపించాయి. ఆ తర్వాత బెనిఫిట్ షోలో ఓ మహిళ మృతి చెందడం, ఆ ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇక ఇప్పుడేమో ఏకంగా ‘షెకావత్’ సమాజాన్ని అవమానించారని, ఆ పదాన్ని తొలగించకపోతే నిర్మాతలను ఇంటికొచ్చి కొడతామని వార్నింగ్ ఇవ్వడం పెను సంచలనం క్రియేట్ చేస్తోంది.
మరోవైపు ఈ సినిమా కలెక్షను ఊహించని విధంగా దూసుకెళ్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించగా… మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా, రష్మిక మందన్న శ్రీవల్లిగా, ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలను పోషించారు