BigTV English
Advertisement

Samantha : మాస్క్‌తో స‌మంత‌.. ఫ్యాన్స్ టెన్ష‌న్‌

Samantha : మాస్క్‌తో స‌మంత‌.. ఫ్యాన్స్ టెన్ష‌న్‌
Samantha

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త కొన్నాళ్లుగా మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎక్స‌ర్‌సైజులు, ట్రీట్‌మెంట్ కార‌ణంగా ఆమె మామూలుగానే బ‌య‌ట‌కు క‌నిపిస్తుంది. మ‌యో సైటిస్ వ‌చ్చిన‌ప్పుడు ఆమె సాధార‌ణ స్థితికి వ‌స్తుందో లేదోన‌ని కూడా అభిమానులు, ప్రేక్ష‌కులు భావించారు. కానీ సామ్ అడ్డంకులను దాటి మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అంతా సెట్ అయ్యింద‌ని ఆమె అభిమానులు ఆశిస్తున్న త‌రుణంలో తాజాగా స‌మంత పోస్ట్ చేసిన ఓ ఫొటో వారిని కంగారు పెట్టింది. ఇంత‌కీ అంత‌లా అభిమానుల‌ను ఇబ్బంది పెట్టిన ఫొటో ఏదో కాదు.. ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని కూర్చుంది.


త‌ను మాస్క్ వేసుకున్న దానికి కూడా ఆమె కార‌ణాన్ని చెబుతూ వ‌చ్చింది. హైప‌ర్ బారిక్ థెర‌పి తీసుకుంటున్నాన‌ని చెప్పింది స‌మంత‌. త‌ను తీసుకునే ట్రీట్‌మెంట్ కార‌ణంగా శ‌రీరంలో పాత టిష్యూస్‌ను రీ జ‌న‌రేట్ చేయ‌టం ద్వారా వ్యాధుల‌పై పోరాటం చేసే శ‌క్తి వ‌స్తుంద‌ని, చాలా శ‌క్తివంత‌మైన థెర‌పి అని శ‌రీరంలో వాపులు, బాధ‌లు దీని ద్వారా తొల‌గిపోతాయ‌ని కూడా చెప్పుకొచ్చింది సామ్ . ఆమె ఫొటో చూసి ముందు కాస్త కంగారు ప‌డ్డ అభిమానులు త‌ర్వాత ఆమె పోస్ట్ చూసి ధైర్యంగా ఉండాల‌ని, త్వ‌ర‌లోనే అంతా స‌ర్దుకుంటుంద‌ని చెబుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది య‌శోద‌తో స‌క్సెస్ కొట్టిన స‌మంత ఈ ఏడాది శాకుంత‌లం సినిమాతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను అలరించ‌టానికి సిద్ధ‌మైంది. కానీ ఆ సినిమా ఆధించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు ఆమె విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషి సినిమాలో న‌టిస్తోంది. ఇది సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. అలాగే రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో సిటాడెల్ తెలుగు వెర్ష‌న్ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తుంది. ఇందులో సామ్‌, ప‌క్కా యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో అల‌రించ‌నుంది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×