Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత (Samantha) ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన నటించి నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ (Ram Charan), మహేష్ బాబు(Maheshbabu), ఎన్టీఆర్(NTR ), అల్లు అర్జున్(Allu Arjun) వంటి టాలీవుడ్ దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం హీరోయిన్స్ అంతా కూడా పాన్ ఇండియా వైడ్ గా దూసుకుపోతుంటే.. తాను కూడా రేస్ కి సిద్ధం అవుతోంది.
జిమ్ లో కసరత్తులు చేస్తూ వీడియో షేర్ చేసిన సమంత..
ఇకపోతే గత కొంతకాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న ఈమె.. దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది కూడా. అందుకే మళ్ళీ ఇప్పుడు తనను తాను బిజీగా మార్చుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది సమంత. అందులో భాగంగానే తాజాగా ఈమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ చెమటోడుస్తున్నట్లు మనకు కనిపిస్తోంది. ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ ప్రారంభం అయింది. ఇప్పుడు కొత్త ఏడాది కొత్త వర్కౌట్స్ చేస్తూ వరుస సినిమాలలో ఆఫర్లు తెచ్చుకొని ఈ యేడాది మొత్తం బిజీగా గడిపేయాలని నిర్ణయించుకున్నట్లు మనకు ఈ వీడియోలో తెలిపింది సమంత. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్స్, అభిమానులు ఈమె పోస్టుకు కామెంట్లు చేస్తూ.. సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంత సినిమాలు..
ఇకపోతే గత ఏడాది శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) హీరోగా వచ్చిన ‘ఖుషి’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చిందని చెప్పవచ్చు. కానీ పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఇక తర్వాత బాలీవుడ్ లో “హనీ బన్నీ” అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా సమంత యాక్షన్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ పూర్తిగా పడిపోయారు. ఇప్పుడు తన అద్భుతమైన నటనతో మరొకసారి అలరించడానికి సిద్ధమవుతోంది సమంత. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ.. కథలను ఎంపిక చేసుకుంటుంది. ఒకవైపు సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే.. మరొకవైపు వ్యాపారంగంలోకి కూడా అడుగుపెట్టింది. అలా తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు అనౌన్స్ చేస్తోంది . త్వరలోనే ఆయా సినిమాలో షూటింగ్లలో కూడా సమంత జాయింట్ కాబోతోంది. ఏది ఏమైనా సమంత కష్టానికి కచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందని అభిమానులు సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే మహానటి, నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా సమంత పై ప్రశంసలు కురిపించింది. నిన్ను స్నేహితురాలు అనడం కంటే సోదరి అనడం చాలా మేలు అంటూ తెలిపింది. తనకు బాలీవుడ్ లో అవకాశం రావడానికి కూడా సమంత కారణమని తెలిపింది కీర్తి సురేష్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">