Manchu Family:మంచు కుటుంబంలో గొడవలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ముఖ్యంగా గత ఏడాది డిసెంబర్లో జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు(Mohan Babu) ఫామ్ హౌస్ వద్ద.. అన్నదమ్ములు ఇద్దరూ.. బౌన్సర్లను పెద్ద ఎత్తున రంగంలోకి దింపడంతో.. అసలైన గొడవ అక్కడే ఏర్పడింది. దీనికి తోడు మోహన్ బాబు ఫైర్ అవుతూ జర్నలిస్టులపై దాడి చేయడంతో.. ఆయనపై కేసు కూడా ఫైల్ అయింది. ముఖ్యంగా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు బెయిల్ నిరాకరించింది హైకోర్టు. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా..నాలుగు వారాలపాటు విచారణను వాయిదా వేస్తూ. మోహన్ బాబుకు కాస్త ఊరట కల్పించింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. కాస్త కేసు గొడవల నుంచి నెల రోజులపాటు విరామం పొందొచ్చు అని అనుకున్న మోహన్ బాబుకి మళ్లీ కష్టాలు ఎదురయ్యాయని చెప్పవచ్చు.
ఇరు వర్గాలపై కేసు నమోదు..
అసలు విషయంలోకి వెళ్తే ఈ ఏడాది సంక్రాంతి పురస్కరించుకొని.. తిరుపతిలో ఉన్న తన నివాసానికి వెళ్లి అక్కడి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.
ఇక్కడే మోహన్ బాబు తల్లిదండ్రుల సమాధులు కూడా ఉన్నాయి. వారి సమాధులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి..ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. అయితే మంచు మనోజ్ (Manchu Manoj)కూడా తన పాప పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో తన నివాసంలో పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని తిరుపతికి వచ్చారు. అయితే అదే సమయంలో మోహన్ బాబు తరఫు రౌడీ మూకలు మంచు మనోజ్ కారుపై దాడి చేశారు. దాంతో డెయిరీ ఫార్మ్ గేటు వద్ద ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఇక్కడ జరిగిన ఘటనపై ఇరువర్గాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలా ఇరు వర్గాల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. ఈ నేపథ్యంలోనే మంచు ఫ్యామిలీకి షాక్ ఇస్తూ రెండు కేసులు నమోదు చేయడం జరిగింది.
ఇటు మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక లతో పాటు మరో ముగ్గురు పై కేసులు నమోదయ్యాయి.
అటు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు..తనపై తన భార్య మౌనిక లపై దాడికి ప్రయత్నించారని.. నిన్న రాత్రి మనోజ్ ఫిర్యాదు చేశారు. అలా ఇరు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు.
ముందుగా మోహన్ బాబు పీఏ తో పాటు MBU సిబ్బంది 8 మంది పై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు.
మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులు కింది పేర్లు జత చేయడం జరిగింది..
A-1. విజయ్ సింహ,
A-2. సురేంద్ర,
A-3. బాలాజీ,
A-4. సారధి,
A-5. కిరణ్,
A-6. రవి శేఖర్,
A-7. హేమాద్రి,
A-8. GM చంద్రశేఖర్,
A-9. MVS మణి తోపాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు.
మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదులో కింది వారిపై కేసులు నమోదు చేశారు.
A-1. మంచు మనోజ్,
A-2. భూమా మౌనిక రెడ్డి,
A-3.రెడ్డి,
A-4. పలని రాయల్,
A-5. పవన్ తో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేయడం జరిగింది.