BigTV English

Samantha: సమంత ఈజ్ బ్యాక్.. రెమ్యూనరేషన్ లో నో కాంప్రమైజ్..

Samantha: సమంత ఈజ్ బ్యాక్.. రెమ్యూనరేషన్ లో నో కాంప్రమైజ్..

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉండేది. ఈ మధ్య సినిమాలకు దూరం ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం సినిమాలు చేసేందుకు సామ్ రెడీ అవుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే గతంలో రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక ఈ మధ్య సమంత స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. హీరోయిన్ సమంత కొత్త లుక్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, డిఫరెంట్ మేకోవర్ చూసిన ఫ్యాన్స్ ఇది వెబ్ సిరీస్ కోసమా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్టయిల్ మాత్రం ఈ మధ్య కొత్తగా ఉంది. ఈ ఫోటోలు ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తీసుకున్నవన్నట్లు తెలుస్తుంది. అయినా, సమంత స్టైల్, గ్లామర్‌లో ఏమాత్రం తగ్గడం లేదు.. తన హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా కూడా వెబ్ సిరీస్ లను పూర్తి చెయ్యాలని అనుకుంది. మొత్తానికి పూర్తి చేసి తన నటనతో మరోసారి అందరిని ఆకట్టుకుంది..

ఇక ఈ మధ్య ఈమె ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పనిచేస్తున్న దర్శక ద్వయంలో ఒకరితో సంబంధం ఉందనే గాసిప్స్ ఊపందుకున్నాయి. మరోవైపు, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే తన రెమ్యునరేషన్ తక్కువగా ఉండేదని ఆమె వెల్లడించారు.. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సామ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకే ప్రయత్నాలు చేస్తుందని ఓ వార్త వినిపిస్తుంది. అందుకే డిఫరెంట్ ఫోటోలను తీయించుకుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ఈ మధ్య సమంత రెమ్యూనరేషన్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అందరికీ సమానంగా రెమ్యూనరేషన్ఇస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సామ్ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం “రక్త బ్రహ్మండ్”లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక, ఫ్యామిలీ మాన్ నెక్స్ట్ సీజన్‌లోనూ ఆమె కనిపించనున్నారనే వార్త అభిమానులను ఆనందింపజేస్తోంది.. ఆ తర్వాత సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉందని సన్నిహిత వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా సమంతను మళ్ళీ సినిమాల్లో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో సినిమాలు తీయాలని సమంతకు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. తెలుగులో సమంత చివరగా ఖుషి సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఇక ముందు సినిమాలు చేస్తుందేమో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×