BigTV English

Viral News: 5 ఏండ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. ఇదీ అసలు కథ!

Viral News: 5 ఏండ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. ఇదీ అసలు కథ!

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ స్నానం(Showering) చేయాలి. ఒంటి మీది మురికి అంతా తొలగిపోయి, శరీరం తేలికగా అనిపిస్తుంది. అలసట తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. తాజాగా అనుభూతిని కలిగిస్తుంది. అందుకే.. పిల్లలు, పెద్దలూ రోజూ స్నానం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, రోజు వారీ దినచర్యల్లో స్నానం అనేది చాలా ముఖ్యమైనది. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేయడం వల్ల శరీరం వాత, పిత్త, కఫం ను కంట్రోల్ చేస్తుంది. స్నానం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవడంతో పాటు చర్మం మెరుపును పొందుతుంది. మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది.


స్నానానికి ఆరోగ్యానికి సంబంధం లేదంటున్న డాక్టర్

స్నానం గురించి ఓ డాక్టర్ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు చేసే సూక్ష్మ జీవులు దెబ్బతింటాయంటున్నారు. స్నానం చేస్తేనే పరిశుభ్రంగా ఉంటామనే వాదన కరెక్ట్ కాదంటున్నారు. అంతేకాదు,  5 ఏండ్లుగా ఆయన స్నానం చేయడం మానేశారు అమెరికాకు చెందని డాక్టర్ జేమ్స్ హాంబ్లిన్ (Dr. James Hamblin). ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా స్నానం చేయాలా? చేయకుండా ఆరోగ్యంగా ఉండలేమా? అనేది నిరూపించేందుకు ఆయన స్నానానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2020లో ‘క్లీన్: ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్‌’(Clean: The New Science of Skin) అనే పుస్తాకాన్ని రాశారు.


స్నానం చేయకపోతే ఏమవుతుంది?

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో నివాసం ఉండేవాడు డాక్టర్ హాంబ్లిన్. రోజుకు అరగంట పాటు స్నానం చేయడం వల్ల జీవితంలో సుమారు 2 ఏండ్లు వృథా అవుతుందనుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన పరిశోధన ద్వారా చర్మానికి సంబంధించిన మైక్రోబయోమ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఐదు ఏండ్ల పాటు ముఖానికి సబ్బు పెట్టుకోలేదు. స్నానం చేయలేదు. కానీ, చేతులను మాత్రం సబ్బుతో కడుక్కునేవాడు. కొన్నిసార్లు శరీరం నుంచి దుర్వాసన వచ్చినప్పటికీ, ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అప్పుడప్పుడు తలను నీటితో కడగడంతో పాటు మురికిగా ఉన్నప్పుడు శుభ్రం చేసుకుంటానని చెప్పాడు.

తరచుగా స్నానం చేస్తే కలిగే నష్టాలు!  

డాక్టర్ హాంబ్లిన్ తన పరిశోధన గురించి కీలక విషయాలు వెల్లడించాడు. గట్ మైక్రోబయోమ్ మాదిరిగా మనిషి చర్మం మీద కోట్లాది బ్యాక్టీరియా నివసిస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియాలో చాలా వరకు చర్మానికి మేలు చేసేవే అన్నారు. స్నానం వల్ల శరీరానికి మేలు చేసే ఆయిల్స్ కూడా తొలగిపోతాయన్నాడు. ఫలితంగా చర్మం పొడిబారే అవకాశంఉందన్నారు.  తాను స్నానం చేయకపోవడం వల్ల చర్మం క్రమంగా జిడ్డుగా మారిందన్నాడు. కొన్ని రోజులకు తామర కూడా సోకిందన్నాడు. కానీ, శరీరం నుంచి ఎలాంటి దుర్వాసన రాలేదన్నాడు. అంటే.. తరచుగా స్నానం చేయడం వల్ల చర్మం మీద ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుందని డాక్టర్ హాంబ్లిన్ ఈ పరిశోధన ద్వారా గుర్తించాడు. దీనిక కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయన్నాడు. ఈ విధానం వల్ల ఎలాంటి ఇబ్బంది లేనప్పిటికీ తాను ఎవరికీ ఇలా ఉండాలని సలహా ఇవ్వనని చెప్పాడు. డాక్టర్ హాంబ్లిన్ కంటే ముందు కూడా పలువురు ఇలాంటి ప్రయోగాలు చేశారు. కానీ, ఇతడు ఏకంగా 5 ఏండ్లు స్నానం చేయకుండా ఉండటం విశేషం.

Read Also: నెలకు రూ. 123 కోట్లు సంపాదిస్తున్న అమ్మాయిలు, ఛీ.. మరీ అలానా?

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×