BigTV English
Advertisement

Martin Luther King OTT : సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ స్ట్రీమింగ్.. ఎప్పుడో తెలుసా..?

Martin Luther King OTT : సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ స్ట్రీమింగ్.. ఎప్పుడో తెలుసా..?

Martin Luther King OTT : కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. భారీ ఎమోషనల్ పాత్రలు చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించడం లో కూడా సిద్ధహస్తుడు . హృదయ కాలేయం అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత అతికొద్ది కాలంలోనే తన స్టైల్ ఆఫ్ కామెడీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రీసెంట్ గా అతను నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన..ఒక పొలిటికల్ సెటైరికల్ డ్రామా.


కథ, కథనం రెండూ అద్భుతంగా ఉన్న ఈ చిత్రం తమిళ్లో వచ్చిన మండేలా మూవీకి రీమేక్. తమిళ్లో తన కామెడీతో అందరినీ మెప్పించే యోగి బాబు ఈ చిత్రంలో నటించాడు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా మూవీకి కొన్ని మార్పులు చేసి తెలుగులో ఈ మూవీకి సంపూర్ణేష్ బాబుని హీరోగా పెట్టారు. మూవీ బాగున్నప్పటికీ రిలీజ్ చేసిన టైం కలిసి రాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ భారీగా అయితే రాలేదు. కానీ స్టోరీ మాత్రం బాగుంది అన్న టాక్ వచ్చింది.

ఈ మూవీలో సంపూర్ణేష్ బాబు తో పాటుగా వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు పూజ కొల్లూరి నిర్వహించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేమిటంటే ఓటు విలువ చాటి చెప్పే విధంగా సాగే ఈ పొలిటికల్ డ్రామా అప్పుడే ఓటీటీ లోకి వచ్చేస్తుంది.


అప్పటివరకు అసలు ఊరిలో గుర్తింపు లేని వ్యక్తి.. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు దాచి పెట్టుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత అతనికి ఆధార్ కార్డు అవసరం ఉంది అని తెలుస్తుంది. అతనికి సహాయం చేసిన పోస్ట్ ఆఫీస్ లోని అమ్మాయి .. అప్పటివరకు సరిగ్గా పేరు కూడా లేని అతనికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టడమే కాకుండా అతని తరఫున ఆధార్, రేషన్ కార్డ్ అన్ని అప్లై చేస్తుంది. 

సరిగ్గా అదే సమయానికి అతను ఉన్న ఊరికి ఎలక్షన్స్ .. ఇక ఈ నేపథ్యంలో అప్పటివరకు గుర్తింపు కూడా లేని ఒక వ్యక్తికి సడన్గా ఎక్కడలేని గుర్తింపు వస్తుంది.ఓటు హక్కు రావడంతో అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అన్న విషయాన్ని ఈ స్టోరీలో బాగా ఆసక్తికరంగా చూపించారు. ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయదగిన ఈ చిత్రంను హ్యాపీగా ఇంటి దగ్గరే ఆన్లైన్లో చూసేయొచ్చు. ఇక ఈ మూవీ సోనీ లివ్ ప్లాట్ ఫామ్ పై ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×