BigTV English

Pawan Kalyan: పవన్ తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన బ్రో డైరెక్టర్.. సాధ్యమయ్యే పనేనా?

Pawan Kalyan: పవన్ తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన బ్రో డైరెక్టర్.. సాధ్యమయ్యే పనేనా?

Pawan Kalyan : సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల ఈయన రాజకీయాల పరంగా ఎంతో బిజీ అవుతూ సినిమాలను కాస్త తగ్గిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy Cm)హోదాలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ సినిమాలను పూర్తిగా తగ్గించారు. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే పూర్తి చేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొత్త సినిమాలకు మాత్రం కమిట్ అవ్వలేదు.


డిప్యూటీ సీఎం..

గతంలో రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ సినిమాలలో నటించేవారు.గత ఎన్నికలలో ఈయన అద్భుతమైన మెజారిటీ సాధించడం, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది . ఎన్నికల ముందు కమిట్ అయిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను పూర్తి చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ లో పవన్ పాల్గొంటున్నారు. దాదాపు నెల రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్లో తనకు సంబంధించిన సన్నివేశాలు అన్నింటిని పూర్తి చేయబోతున్నారని తెలుస్తుంది.


కొత్త సినిమా…

ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలు ఏంటి అనే విషయం ఇప్పటివరకు తెలియదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం బ్రో సినిమా(Bro Movie) దర్శకుడు సముద్రఖని (Samuthirakani)పవన్ కళ్యాణ్ కోసం సరికొత్త ప్రాజెక్టు సిద్ధం చేశారని ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ ని కలిశారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా కథ విన్న తర్వాత డేట్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

హరిహర వీరమల్లు…

మరి సముద్రఖని చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కు నచ్చిందా? ఆయన ఈ సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నారా? డేట్స్ కూడా ఇచ్చారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ షెడ్యూల్ లో సినిమాలు చేయటానికి ఏమాత్రం సాధ్యపడదు. మరి దర్శకుడు సముద్రఖని సినిమాకు పవన్ ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సిందే. గతంలో ఈయన డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వెండి తెరపై చివరిగా నటించిన సినిమా కూడా ఇదే కావటం విశేషం. ఇక త్వరలోనే పవన్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×