Samyukta Menon : సంయుక్త మీనన్... త్రివిక్రమ్ క్రియేషన్ అంటే ఇదే అంటూ కామెంట్స్

Samyukta Menon : సంయుక్త మీనన్… త్రివిక్రమ్ క్రియేషన్ అంటే ఇదే అంటూ కామెంట్స్

Samyukta Menon
Share this post with your friends

Samyukta Menon

Samyukta Menon : టాలీవుడ్‌కి ఓ హీరోయిన్ దొరికింది. అట్టాంటి ఇట్టాంటి హీరోయిన్ కాదు. గోల్డెన్ లెగ్ హీరోయిన్. బ్రహ్మాజీ అయితే ప్లాటినమ్ లెగ్ హీరోయిన్ అనేశాడు కూడా. అందుకు తగ్గట్టే… నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో సంయుక్త మీనన్ పేరు మారిమోగిపోతోంది. మొదట భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సంయుక్త మీనన్. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చిన్నదే అయినా… ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియమ్‌తో పోల్చితే ఎక్కువే. ఇక ఆ తరువాత బింబిసార సినిమా చేసింది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కాకపోయినా… హిట్ అయింది, పేరొచ్చింది. ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సింది సార్ మూవీ. మాష్టారు మాష్టారు సాంగ్‌తో పల్లె జనాలకు కూడా ఎక్కేసింది సంయుక్త మీనన్. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ తెచ్చుకోనంత క్రేజ్ వచ్చేసింది.

రీసెంట్‌గా విరూపాక్ష సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందీ సినిమా. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కు యాక్టింగ్ స్కోప్ కాస్త ఎక్కువనంటున్నారు. భీమ్లా నాయక్, బింబిసార, సార్ సినిమాలతో పోల్చితే.. విరూపాక్షలో బెటర్ రోల్ వచ్చిందని చెబుతున్నారు. ఎలాగూ ఈ సినిమా కూడా హిట్ అవడంతో.. వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టిన హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది. సో, ఇకపై టాలీవుడ్‌ని ఏలే హీరోయిన్ సంయుక్త మీననే అంటున్నారు.

ప్రస్తుతం సంయుక్తకు పోటీగా ఉన్నది ఇద్దరే. ఒకరు శ్రీలీల, మరొకరు కృతిశెట్టి. ఈ ఇద్దరికీ బంపర్ ఆఫర్స్ వస్తున్నా సరే.. సరైన హిట్స్ పడడం లేదు. రేప్పొద్దున ఐరన్ లెగ్స్ అన్నా అనొచ్చు. కాని, సంయుక్త మీనన్  విషయంలో మాత్రం గోల్డెన్ లెగ్ అనే పేరు ఆల్రడీ వచ్చేసింది. ఇక పోటీగా పూజా హెగ్డే, కీర్తి సురేష్ ఉన్నా.. వాళ్లు ఆల్‌మోస్ట్ ఫేడ్ ఔట్. ఇక రాజ్యం మొత్తం సంయుక్తదే.

సరే.. ఇంతకీ సంయుక్త మీనన్ త్రివిక్రమ్ క్రియేషన్ ఎలా అవుతుంది. ఎలా అంటే.. భీమ్లా నాయక్‌లో సంయుక్త మీనన్ క్యారెక్టర్‌ను కాస్త పెంచింది త్రివిక్రమే అంటారు. ఆ తరువాత సార్ సినిమా. ఈ సినిమా తీసింది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ అయిన సితార ఎంటర్‌టైన్మెంట్. సో.. ఈమె త్రివిక్రమ్ హీరోయిన్ అని ముడిపెడుతున్నారు. ఎంతైనా త్రివిక్రమ్ బ్రాండ్ హీరోయిన్ అంటే.. టాలీవుడ్‌ని కొన్నేళ్ల పాటు ఏలుతుందనే అర్ధం. గతంలో ఇలియానా, సమంత.. ఇప్పుడు పూజా హెగ్డే. నెక్ట్స్.. సంయుక్త మీననే అంటున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Crime: భర్తను హత్య చేసిన భార్య.. ఐదురోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. చివరికి..

Bigtv Digital

Niharika Divorce: నిహారిక జంటకు విడాకులు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు మంజూరు!

Bigtv Digital

BJP : బీజేపీకి షాక్.. పని చేయని మోదీ మ్యాజిక్, అమిత్ షా వ్యూహాలు..

BigTv Desk

ISRO : నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F12 రాకెట్ .. కొనసాగుతున్న కౌంట్ డౌన్..

Bigtv Digital

Bhuvneshwar Kumar : భువీకి ‘రికార్డ్’ ఛాన్స్ వస్తుందా?

BigTv Desk

Xiaomi Car  : టెస్లాకు పోటీగా జియోమీ కారు.. లాంచ్ ఎప్పుడంటే..?

Bigtv Digital

Leave a Comment