BigTV English

Sundeep Kishan’s MaayaOne Teaser: సందీప్ కిషన్ ‘మయావన్’ టీజర్ విడుదల.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!

Sundeep Kishan’s MaayaOne Teaser: సందీప్ కిషన్ ‘మయావన్’ టీజర్ విడుదల..  చూస్తే గూస్ బంప్స్ పక్కా!

Sundeep Kishan’ MaayaOne Teaser Out Now: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్‌గా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో కాస్త విఫలం అయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్‌ను అందుకుంది. కలెక్షన్లలో మాత్రం అదరగొట్టేసింది. ఇక ఈ మూవీ తర్వాత ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సందీప్ రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా ఇప్పుడు మరోమూవీ చేస్తున్నాడు.


ఆ సినిమానే ‘మయావన్’. క్రియేటివ్ డైరెక్టర్ సి.వి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబోలో ఇదివరకే ‘ప్రాజెక్ట్ జెడ్’ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘మయోవన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ సర్ప్రైజ్‌ను అందించారు.

ఇందులో భాగంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అద్భుతమైన సైన్స్‌ఫిక్షన్ క్లిప్స్‌తో అదిరిపోయింది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ టీజర్ అడ్వాన్స్‌డ్ హ్యూమనాయిడ్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలతో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా మొత్తం సైన్స్ పై ఆధారపడే రన్ అవుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.


Also Read: మరొక హిట్ కోసం సందీప్ కిషన్.. కొత్త సినిమా షురూ చేసేశాడుగా..

అయితే ఇందులో సైన్స్‌తో విధ్వంసం సృష్టించబోతున్న వారిని హీరో సందీప్ పట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నిల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాంబ్రహ్మం సుంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో సందీప్ కిషన్‌కు జోడీగా ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Vikrant Massey: క్యాబ్ డ్రైవర్ తో 12 th ఫెయిల్ హీరో గొడవ.. అసలు నిజం ఇదే.. ?

 

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×