Big Stories

Vikrant Massey Argue: క్యాబ్ డ్రైవర్ తో 12 th ఫెయిల్ హీరో గొడవ.. అసలు నిజం ఇదే.. ?

Vikrant Massey Serious Argue with Cab Driver: బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు ఆయన నటించిన సినిమాలు ఏమో కానీ, గతేడాది 12 th ఫెయిల్ సినిమాతో విక్రాంత్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల నిజ జీవిత వృత్తాంతంతో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా భారీ విజయాన్ని అడ్డుకోవడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత విక్రాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు 5 సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

ఇకపోతే తాజాగా విక్రాంత్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఈ హీరో.. ఒక క్యాబ్ డ్రైవర్ తో గొడవపడుతున్నట్లు కనిపిస్తుంది. సదురు క్యాబ్ డ్రైవర్ .. డబ్బుల కోసం విక్రాంత్ ను నిలదీయడం.. దానికి అతను నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని అడగడం కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది అని అంటే.. ఒక లొకేషన్ కు విక్రాంత్ క్యాబ్ బుక్ చేశాడు. లొకేషన్ కు చేరాకా..ముందు చెప్పినదానికన్నా.. డబ్బులు ఎక్కువ అయ్యాయని, మొత్తం డబ్బు ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ అడిగాడు. దానికి విక్రాంత్.. మొదట యాప్ లో నాకు డబ్బులు తక్కువ చూపించింది. అందుకే నేను క్యాబ్ బుక్ చేశాను. ఇప్పుడు ఇక్కడకు వచ్చాకా ఎక్కువ చూపిస్తే నేనెందుకు ఇవ్వాలి అని గొడవకు దిగాడు.

- Advertisement -

ఇక దీంతో  క్యాబ్ డ్రైవర్ వీడియో ఆన్ చేసి.. నా పేరు ఆశిష్.. క్యాబ్ ఎక్కి ఈ వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వడం లేదు అని చెప్పాడు. చెల్లించాల్సిన డబ్బులు నేను ఇచ్చేస్తాను.. కానీ, ఎక్కువ ఇవ్వను అనగానే.. అది నా తప్పు ఎలా అవుతుంది.. యాప్ తప్పు. నాకెందుకు మీరు డబ్బులు ఇవ్వరు. మాకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారుగా అనగా.. ఏంటి బెదిరిస్తున్నావా..? ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి.. అది నా కష్టార్జితం.. ఇలాంటి నాటకాలు నా దగ్గర కుదరవు. మొదట చూపించిన అమౌంట్ కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Jyothi Rai: మొగిలయ్యకు సాయం చేసిన బుల్లితెర నటి

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్య ఓలా. ఉబర్ ఇలానే డబ్బులు ఎక్కువ చూపించి కస్టమర్ల దగ్గర డబ్బులు గుంజుతున్నాయి. దీంతో చాలామంది విక్రాంత్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇదంతా విక్రాంత్ కావాలనే చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఇన్ డ్రైవ్ అనే యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్లు.. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ షూట్ ఉండడంతో హైప్ కోసం ఇలా చేసినట్లు చెప్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News