Big Stories

4 Died in UP: విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ నలుగురు మృతి!

Four Died during Cleaning Septic Tank in Uttar Pradesh: వాళ్లు ముగ్గురు కూడా కూలీలుగా పని చేస్తుంటారు. అయితే, వీళ్లు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనికి వెళ్లారు. ఓ ఇంటి వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు అందులోకి వెళ్లారు. అయితే, అందులో నుంచి వచ్చిన విషయవాయువును పీల్చి స్పృహ కోల్పోయారు.

- Advertisement -

విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు కూడా వారిని కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా స్పృహ కోల్పోయాడు. వెంటనే వారిని అందులోంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్ లోని చందౌలిలో ఉన్న న్యూ మహల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించేందుకు ముగ్గురు కూలీలను తీసుకువచ్చారు. అయితే, వారు క్లీన్ చేసేందుకు సెప్టిక్ ట్యాంక్ లోకి వెళ్లారు. క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందులో విషయవాయువు వెలువడడంతో దానిని పీల్చి ఆ ముగ్గురు స్పృహ కోల్పోయారు. విషయం గమనించిన ఇంటి ఓనర్ కొడుకు వారిని కాపాడేందుకని అతను కూడా అందులోకి దిగాడు. దీంతో అతను కూడా ఆ విషవాయువును పీల్చి స్పృహ కోల్పోయాడు.

Also Read: Delhi High Court : ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో ?

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో వారిని సెప్టిక్ ట్యాంక్ లో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం యోగీ.. వారి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా వెంటనే అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులను ఆదేశించారు.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

ఈ ఘటనపై సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంక్ లో విషవాయువు వల్ల ఓనర్ కొడుకుతోపాటు ముగ్గురు కూలీలు మృతిచెందారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News