Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. తన సినిమాలతో విధ్వంసం సృష్టించి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి, ఆ తర్వాత అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ గా డబ్బింగ్ చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇంకా గత ఏడాది ‘అనిమల్’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే సందీప్ తన సినిమాలతో ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారని చెప్పవచ్చు. అలాంటి ఈయన తాజాగా నిన్న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన నాగచైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలోనే ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే సాయి పల్లవి (Sai Pallavi)క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.
సాయి పల్లవి అర్జున్ రెడ్డికి అందుకే ఒప్పుకోలేదు..
సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ ఏంటో తెలియజేశారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ” నేను అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు కేరళ నుంచి ఒక కోఆర్డినేటర్ నాకు కాల్ చేశారు. నేను మీ పేరు చెప్పి ఒక రొమాంటిక్ సినిమా చేస్తున్నాను. ఆమె నటిస్తుందా ? అని అడిగితే , అందులో రొమాన్స్ సన్నివేశాలు ఎంతవరకు ఉండొచ్చు అని అడిగాడు. ఎక్కువ అదే ఉంటుందని నేను అంటే.. ఆయనేమో.. ఇకపై మీరు ఆమెను మర్చిపోండి. ఆమె కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోదు అని అన్నాడు. ఇక నేను చేసేదేమీ లేక సరే అన్నాను. అయితే హీరోయిన్లు ఏదో ఒక సమయంలో వారు తీసుకుని నిర్ణయాన్ని మార్చుకుంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ సాయి పల్లవి మాత్రం మొదటి రోజు ఏ నిర్ణయం తీసుకుందో దానికి కట్టుబడి పద్ధతి అయిన పాత్రలు మాత్రమే చేస్తూ ఇప్పటికీ అదే క్యారెక్టర్ ను అలాగే మెయింటైన్ చేస్తూ రావడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా ఆమె చాలా గ్రేట్ అంటూ సాయి పల్లవి పై ప్రశంసలు కురిపించారు సందీప్ రెడ్డి వంగా. మొత్తానికైతే శృతి మించిన సన్నివేశాల వల్లే సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెప్పలేదని సందీప్ రెడ్డి ఒక్క మాటలో చెప్పేశాడు.
సందీప్ రెడ్డి వంగా కెరియర్..
స్క్రీన్ రైటర్ గా, ఎడిటర్ గా మంచి పేరు దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు డైరెక్టర్ గా మారి తెలుగు, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 1981 డిసెంబర్ 25 వరంగల్ తెలంగాణలో జన్మించిన ఈయన , 2014లో మనీషా రెడ్డిని వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చారు. ఇక 2017లో అర్జున్ రెడ్డి సినిమాకి స్క్రీన్ రైటర్ గా, డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రిటికల్ కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక కబీర్ సింగ్ సినిమాతో ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి అప్పట్లోనే రికార్డు సృష్టించారు. 2023లో అనిమల్ సినిమా చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన 9వ ఇండియన్ చిత్రంగా రికార్డు సృష్టించారు. అలాగే ఈ చిత్రానికి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లేయర్ రైటర్, బెస్ట్ ఎడిటర్ గా 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది.