OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో చూడలేకపోయినా, ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే వెబ్ సిరీస్ లు థియేటర్లతో సంబంధం లేకుండా డైరెక్ట్ గానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇదివరకు సినిమాలతో సరిపెట్టుకున్న ప్రేక్షకులు, ఇప్పుడు వెబ్ సిరీస్ లను కూడా బాగా ఆదరిస్తున్నారు. వీటిలో థ్రిల్లర్ సిరీస్ ల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. బెంగాల్ నుంచి వచ్చిన ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటిలో సందడి చేస్తోంది. ఈ సిరీస్ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అడ్డా టైమ్స్ (Adda Times) లో
ఈ బెంగాల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ పేరు ‘అభిషప్తో‘ (Abhishapto). 2023 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కి అభిమన్యు ముఖర్జీ దర్శకత్వం వహించారు. హీరోయిన్ కి మాత్రమే ఆత్మలు కనబడుతూ ఉంటాయి. ఆమెపై మంత్రగాడు చేతబడి చేస్తూఉంటాడు. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డ టైమ్స్ (Adda Times) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక పాడు బడ్డ బావిలో గుర్తు పట్టలేని విధంగా ఉండే ఒక శవాన్ని పోలీసులు బయటికి తీస్తారు. ఎవరిదో కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు అంకుర్ అనే వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్తాడు. అపర్ణ పెళ్లి కొడుకుతో సపరేట్గా మాట్లాడుతుంది. తను ఒకవేల తప్పు చేస్తే ఏం చేస్తావని పెళ్లి కొడుకుని ప్రశ్నిస్తుంది. చంపేస్తానంటూ సమాధానం చెబుతాడు పెళ్లి కొడుకు. ఆ తర్వాత జోక్ చేశాను అంటూ సరదాగా మాట్లాడుతాడు. ఈ క్రమంలోనే ఇద్దరికీ ఒకరంటే ఒకరు నచ్చుతారు. పెళ్లికి కూడా అపర్ణ ఓకే చెప్పడంతో, 15 రోజుల్లోనే పెళ్లి జరగాలని పెళ్ళికొడుకు తల్లిదండ్రులు చెప్తారు. 15 రోజుల్లోనే కష్టం అంటూనే, ఆడపిల్ల పెళ్లి చేయాలని అనుకుంటారు అపర్ణ తల్లిదండ్రులు. తమ దగ్గర ఉన్న డిపాజిట్ మనీని తీసుకొని చేసేయాలని అనుకుంటారు. ఆ తర్వాత అంజలి అనే అమ్మాయి కనపడటం లేదని పోలీసులకు అపర్ణ కంప్లైంట్ చేస్తుంది. తను చనిపోయినట్టుగా తెలుసుకొని బాధపడుతుంది. అయితే మరోవైపు అపర్ణ మీద ఒక మాంత్రికుడు చేతబడి చేస్తుంటాడు. అపర్ణకి చనిపోయిన కొంతమంది వ్యక్తుల ఆత్మలు కనబడుతూ ఉంటాయి. వాళ్ల వల్ల తను భయపడుతూ ఉంటుంది. చివరికి చనిపోయిన అంజలి కూడా తన కళ్ళ ముందర కనపడుతుంది. ఆ తరువాత అపర్ణ పెళ్లి అంకుర్ తో జరిగిపోతుంది. తర్వాత అపర్ణ అనుకోని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. చివరికి అపర్ణ ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి? ఆమెకు ఆత్మలు ఎందుకు కనబడుతున్నాయి? అంజలిని ఎవరు చంపి ఉంటారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అడ్డ టైమ్స్ (Adda Times) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అభిషప్తో’ (Abhishapto) అనే ఈ బెంగాల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ ను మిస్ కాకుండా చూడండి.