Oyo Travelopedia : ఈ ఏడాదిలో ఎక్కువ మంది ట్రావెల్ కోసం ఎంచుకున్న నగరాలేంటో తెలుసా? ఆధ్యాత్మిక ప్రాంతాల లిస్ట్ లో చోటు సంపాదించి ముందు వరుసలో ఉన్న టెంపుల్ టౌన్స్ గురించి తెలుసా? అలాగే.. ఈ ఏడాది ఎక్కువ మంది స్టే చేసేందుకు ఎంచుకున్న నగరం కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే.. ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో ట్రావెలోపీడియా – 2024 విడదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలన్నీ చూడొచ్చు.. తన ట్రావెల్ బుకింగ్ డేటా ఆధారంగా వివిధ కేటగిరీల్లోని బుకింగ్స్ వివరాల్ని ఓయో వెల్లడించింది. దీని ప్రకారం..
భారత్ లో ఆధ్యాత్మిక టూరిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. నిత్యం లక్షలాది మంది భక్తులు వివిధ ఆలయాలను చుట్టేస్తుంటారు. అందులో.. ఓయో విడుదల చేసిన ప్రముఖ జగన్నాథ స్వామి కోవెల పూరీ క్షేత్రం, వారణాసి, హరిద్వార్ వంటి నగరాలు ముందు వరుసలో నిలిచాయి. ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పోటీలో నిలువలేకపోయినా.. దియోఘర్, పలని, గోవర్థన్ వంటి ఆధ్యాత్మిక నగరాల్లో బుకింగ్స్ సైతం గణనీయంగా పెరిగినట్లు ఓయో ట్రావెలోపీడియా వెల్లడించింది. ఈ నగరాల్లో గతంలో కంటే ఎక్కువ బుకింగ్స్ రాగా.. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మంది ఈ నగరాల్లో బస చేసినట్లు డేటా విశ్లేషించింది.
ఇక.. ఎక్కువ మంది వివిధ అవసరాలకు వచ్చే హైదరాబాద్ నగరం తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోని అన్ని వర్గాల వారిని దగ్గరికి తీసుకునే నగరంగా గుర్తింపు పొందిన భాగ్యనగరం.. బుకింగ్స్ లోనూ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మిగతా నగరాల కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ మంది స్టే చేసినట్లు ఓయో వెల్లడించింది. ఇక ఇదే తరహాలో బెంగళూరు, దిల్లీ, కోల్ కత్తా వంటి నగరాలు సైతం బుకింగ్స్ లో మంచి స్థానాల్లో నిలిచినట్లు డేటా వెల్లడించగా.. హైదరాబాద్ మాత్రం ఎక్కువ బుకింగ్స్ సాధించింది.
మరి దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలున్న ఉత్తర్ ప్రదేశ్.. హోటల్ బుకింగ్స్ లోనూ అనే రీతిలో కొనసాగింది. ట్రావెలర్స్ కు అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్ గా, స్పిరిచ్ వల్ సెంటర్ గా ఉత్తర్ ప్రదేశ్ తన ప్రత్యేకతను కొనసాగించింది.
ఓయో డేటా ప్రకారం.. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి అత్యధిక మంది ట్రావెల్ బుకింగ్స్ చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ రాష్ట్రాల్లోని మేజర్ నగరాలే కాదు.. పాట్నా, రాజమహేంద్రవరం, హుబ్లీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ప్రజలు కూడా అనూహ్యంగా పెరుగుదల కనిపించింది. ఏడాదిలోనే ఈ నగరాల్లో దాదాపు 48 శాతం ఎక్కువ బుకింగ్స్ నమోదైనట్లు తెలిపింది.
ఇక మంచి ట్రావెల్ అండ్ బెస్ట్ రిలాక్సింగ్ స్పాట్ ల కోసం ట్రావెలర్స్… జైపూర్ ను మొదటి స్థానంలో నిలుపగా, గోవా, పాండిచ్చెరి, మైసూర్ వంటి నగరాలు తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. అదే సమయంలో ఆసక్తికరంగా ముంబయి నగరంలో బుకింగ్స్ తగ్గిపోయినట్లు గుర్తించారు.
Also Read : ఈ కేఫ్ లో 15 నిమిషాలకు ఓసారి వర్షం, కాఫీ తాగాలంటే రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే!
గ్లోబల్ ట్రావెల్ ల్యాండ్ స్కేప్ లో మార్పును 2024 ఏడాదిలో గమనించినట్లు ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్ బోలే పేర్కొన్నారు. రిమోట్ వర్క్ విధానం కారణంగా ట్రావెలర్స్ కు మంచి డిమాండ్ పెరిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలా.. అనేక రకాలుగా ఇండియన్లు… వారి అవసరాలు, ఖాళీ సమయాన్ని బట్టి హాలిడే, బిజినెస్ స్పాట్ లను ఎంచుకున్నారు.