Palnadu News: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లలోని వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో బైక్‌ను స్కార్పియో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నేతలు మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తులను గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుగా గుర్తించారు. వీరిద్దరు బైక్ పై వెళ్తుండగా స్కార్పియో వాహనం ఢీకొట్టిందని తెలిపారు. స్కార్పియో వాహనం టీడీపీ పార్టీకి చెందిన వెంకట్రామయ్యదిగా గుర్తించారు.
ALSO READ: ESIC Recruitment: ESICలో 558 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే సమయం, జీతం రూ.78,800
టీడీపీలో రెండు వర్గాల మధ్య కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. వెంకట్రామయ్య వర్గం రీసెంట్ గా వైసీపీ నుంచి టీడీపీలో చేరింది. కావాలనే వెంకట్రామయ్య.. గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్ల, కోటేశ్వరావులను వాహనంతో ఢీకొట్టినట్టు చంపినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Rain Alert: ఈ నెల 29 వరకు అతిభారీ వర్షాలు.. పిడుగులతో కూడిన వర్షం, ఈ జిల్లాల వారు జాగ్రత్త!