BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ కోసం సందీప్ వంగా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్!

Allu Arjun : అల్లు అర్జున్ కోసం సందీప్ వంగా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో. రీసెంట్‌గానే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దీంతో ఫ్యాన్స్‌కి వ‌చ్చిన కిక్కే వేరు. అయితే ఈ సినిమా ట్రాక్ ఎక్క‌టానికి స‌మ‌యం ఉంది. 2024లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందుకు కార‌ణం ఇటు బ‌న్నీ.. అటు సందీప్ వంగా ఇద్ద‌రూ సినిమాల‌తో బిజీగా ఉండ‌ట‌మే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే మూవీ టైటిల్ . అల్లు అర్జున్‌కి ఇటు మాస్, అటు క్లాస్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. పుష్ప ది రైజ్ చిత్రంతో అది కాస్త పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది.


ప్ర‌స్తుతం బ‌న్నీకున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే సందీప్ వంగా AA 23 కోసం ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ పెట్టార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ టైటిల్ ఏంటో తెలుసా!.. ‘భద్రకాళి’. నిజంగానే ఇది పవర్ఫుల్ టైటిల్. దీన్నే ఫిక్స్ చేస్తే మాత్రం సందీప్ వంగా.. ఐకాన్ స్టార్‌ను మ‌రో రేంజ్‌లో ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. చేస్తాడు కూడా. అయితే ఇప్పుడే క‌దా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. అప్పుడే టైటిల్ ఏంటి? అదంతా రూమర్సే అనే వారూ లేక‌పోలేదు. నిజానిజాలు తెలియాలంటే కొన్నాళ్లు వెయిటింగ్ త‌ప్పేలా లేదు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌… సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2 సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత త్రివిక్ర‌మ్ దర్శ‌క‌త్వంలో బ‌న్నీ సినిమా ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో సైడ్ సందీప్ రెడ్డి వంగా విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. త‌నిప్పుడు ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తున్నాడు. దాని త‌ర్వాత ప్ర‌భాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తాడు. దాని త‌ర్వాత అల్లు అర్జున్ సినిమా ట్రాక్ ఎక్కుతుంద‌ని టాక్‌.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×