E-Paper
Advertisement

Flu Variant : మళ్లీ తెరపైకి ప్రాణాంతక వ్యాధి..

Flu Variant : మళ్లీ తెరపైకి ప్రాణాంతక వ్యాధి..
Advertisement
Flu Variant

Flu Variant : మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లను బట్టి మనిషి ఆరోగ్యం రోజురోజుకీ దెబ్బతింటోంది. ఆఖరికి పీల్చుకునే గాలి నుండి మానవాలికి ప్రాణహాని ఏర్పడుతుంది. రోజుకొక అంతుచిక్కని వ్యాధి మనిషిని బాధపెడుతోంది. ఇప్పటికే కోవిడ్ కొట్టిన దెబ్బ నుండి పూర్తిగా బయటపడకముందే.. ఒక పాత వ్యాధి మళ్లీ తెరపైకి వచ్చినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అదే స్వైన్ ఫ్లూ.

కోవిడ్ కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని భయపెట్టిన వ్యాధి స్వైన్ ఫ్లూ. ఈ వ్యాధి పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇన్నాళ్ల తర్వాత కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్మార్) అందించిన డేటా ప్రకారం.. తెలంగాణలో 2022 డిసెంబర్ నుండి 2023 మార్చ్ మధ్యలో స్వైన్ ఫ్లూకు సంబంధించిన ఒక సబ్‌టైప్ ఏ(హెచ్3ఎన్2) కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

Advertisement

గాంధీ ఆసుపత్రి లేబరెటరీ నుండి సేకరించిన వివరాల ప్రకారం ఐసీఎమ్మార్ ఈ డేటాను పొందుపరిచింది. ముందుగా స్వైన్ ఫ్లూ కూడా జ్వరం రూపంలోనే అటాక్ చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. జ్వరం, గొంతునొప్పి, కీళ్ల నొప్పులు, దగ్గు.. స్వైన్ ఫ్లూ లక్షణాలను వారు తెలిపారు. అలాంటి లక్షణాలతో వచ్చిన వారికి కోవిడ్ టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ అని తేలింది. దీంతో వారికి వచ్చిన వ్యాధి స్వైన్ ఫ్లూనే అని వైద్యులు నమ్మడం మొదలుపెట్టారు.

స్వైన్ ఫ్లూ లాగానే దాని సబ్‌టైప్ ఏ(హెచ్3ఎన్2) కూడా వ్యాప్తి విషయంలో వేగంగా ఉంటుందని తేలింది. అందుకే గత డిసెంబర్ నుండి ఇప్పుడు మార్చ్ వరకు ఎన్నో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని డేటా చెప్తోంది. కోవిడ్ లాగానే స్వైన్ ఫ్లూకు కూడా ప్రత్యేక చికిత్స అనేది ఏమీ లేదని, కేవలం దానికి మాత్రమే కాకుండా ఏ వైరల్ వ్యాధులకు కూడా ప్రత్యేకంగా చికిత్సలు లేవని వైద్యులు బయటపెట్టారు. సెల్ఫ్ కేర్, ముందుజాగ్రత్తతో మాత్రమే దీని వ్యాప్తిని అరికట్టగలమని వారు సూచించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×