BigTV English

Sangeeth Shobhan : కోటిన్నర డిమాండ్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ హీరో..?

Sangeeth Shobhan : కోటిన్నర డిమాండ్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ హీరో..?

Sangeeth Shobhan : 2023 చివర్లో ‘మ్యాడ్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ‘హారిక & హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ కూతురు హారిక ఈ సినిమాని నిర్మించారు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ దీనికి సహా నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. పేరుకి హారిక నిర్మించిన ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం నాగవంశీనే కొట్టేశాడు. కానీ నాగవంశీ ప్రమోషన్స్ లో చెప్పినట్టు ‘జాతి రత్నాలు’ రేంజ్లో ‘మ్యాడ్’ లాభాలు తెచ్చిపెట్టింది లేదు. కొంతమంది ఈ సినిమా మొత్తం లాజిక్ లెస్ అంటూ విమర్శించారు.


అయినా సరే తమ సినిమాలో కామెడీ చూడటానికి మాత్రమే రండి అని చిత్ర బృందం ముందుగా చెప్పడం వల్ల… సక్సెస్ కి ఆ సినిమా లాజిక్స్ అయితే అడ్డు రాలేదు. ‘మ్యాడ్’ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ ముగ్గురిలో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. సినిమాలో డిడి అలియాస్ దామోదర్ పాత్రలో బాగా నవ్వించాడు. సినిమాలో అతని కామిక్ టైమింగ్ బాగా హైలెట్ అయ్యింది. లుక్స్ పరంగా ఎలా ఉన్నా.. నటుడిగా అయితే సంగీత్ శోభన్ పాస్ మార్కులు వేయించుకున్నాడు. తోటి హీరోలు నార్నె నితిన్, రామ్ నితిన్ ..ల కంటే కూడా సంగీత్ శోభన్ హైలెట్ అయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు.


‘మ్యాడ్’ కి ముందు సంగీత్ శోభన్ ఎన్నో సినిమాలు, సిరీస్..లలో నటించాడు. ‘జకాస్’ ‘పిట్ట కథలు’ ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ‘3 రోజెస్’ ‘బెంచ్ లైఫ్’ వంటి క్రేజీ సిరీస్/ సినిమాల్లో సంగీత్ శోభన్ నటించాడు. ‘మ్యాడ్’ తర్వాత అతను నటించిన ‘ప్రేమ విమానం’ సినిమా కూడా ఓటీటీలో విడుదల అయ్యింది. అయినప్పటికీ సంగీత్ శోభన్ మ్యాడ్ హీరోగానే ఫేమస్.

ఈ విషయాలు అటుంచితే..’మ్యాడ్’ తర్వాత సంగీత్ శోభన్ పారితోషికం గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట. ‘మ్యాడ్ స్క్వేర్’ అనౌన్స్ చేసే ముందు వరకు సంగీత్ శోభన్ రూ.70 లక్షల నుండి రూ.1 కోటి పారితోషికం డిమాండ్ చేశాడట. కానీ అప్పుడే సంగీత్ శోభన్ పై కోటి వరకు పెట్టడానికి నిర్మాతలు రెడీగా లేనట్టు తెలుస్తుంది. బేరసారాలు జరిపి రూ.70 లక్షలకి ఫైనల్ చేయాలని నిర్మాతలు చూశారట. కానీ అందుకు సంగీత్ శోభన్ ఒప్పుకోవడం లేదు అని ఇండస్ట్రీ టాక్. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ అయ్యే వరకు మరో ప్రాజెక్టుకి కమిట్ అవ్వకూడదు అని సంగీత్ డిసైడ్ అయ్యాడట.

ఎలాగు ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ టాక్ తెచ్చుకుంటుంది కాబట్టి.. తర్వాత అతను అడిగినంత డిమాండ్ చేయడానికి కుదురుతుందని అతను భావిస్తున్నాడట. ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్టులకి కోటిన్నర చెప్పాలని.. అప్పుడు నిర్మాతలు కోటి ఇవ్వడానికైనా ఓకే చెబుతారనేది సంగీత్ శోభన్ ప్లాన్ అనమాట. కాకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్లో అతనికి క్రెడిట్ దక్కే ఛాన్స్ ఉన్నా… ఫుల్ క్రెడిట్ అతనే తీసుకోవాలి అనుకోవడం.. కొంచెం తొందరపాటే అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×