Sankranthi Movies 2024: టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో నిలవగా.. అందులో రెండు సినిమాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నాలుగు చిత్రాల్లో కామన్ పాయింట్ ఉందన్న విషయాన్ని గమనించారా?. మరి ఆ కామన్ పాయింట్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
హనుమాన్..
ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన హనుమాన్ మూవీ పాజిటివ్ టాక్‌తో అందరినీ ఇంప్రెస్ చేసింది. కంటెంట్ కూడా బాగుంది అన్నట్లుగా ఉండటంతో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా సాధారణ కమర్షియల్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉండటమే కాకుండా.. ఎక్కువగా హింసలేని ఏకైక సంక్రాంతి మూవీ ఇదే.
గుంటూరు కారం..
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘గుంటూరు కారం’ మూవీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ అంటూ మొదటి నుంచి మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో మహేశ్ ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు అనే వార్త బయటకొచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈరోజు రిలీజైన ఈ సినిమా మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఈ మూవీలో మహేశ్ యాక్షన్ ఫైట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
సైంధవ్..
విక్టరీ వెంకటేశ్ తన కెరీర్‌లో 75వ మూవీగా ‘సైంధవ్’ చేస్తున్నాడు. శైలేష్ కొలను దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో వెంకీ ఇదివరకూ ఎన్నడూ లేనంత వైలెంట్‌గా కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో ఉన్న కొన్ని సీన్స్ చూస్తే అందులో హింసాత్మక సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 13న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
నా సామిరంగ..
నా సామిరంగ చిత్రంతో కింగ్ నాగార్జున ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో జనవరి 14న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఇక ఈ మూవీలో కూడా ఫుల్ యాక్షన్ ఫైట్స్ ఉన్నట్లు ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన.. రిలీజ్ కానున్న చిత్రాల్లో హింసాత్మక సన్నివేశాలు ఉన్నాయి.