BigTV English

Sankranthiki Vasthunam Collections :  వెంకీ జోరు.. బాక్సాఫీస్ హోరు.. ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Collections :  వెంకీ జోరు.. బాక్సాఫీస్ హోరు.. ఎన్ని కోట్లంటే?

Sankranthiki Vasthunam Collections : టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గత ఏడాది నటించిన సైందవ మూవీ బాక్సఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ ఏడాది మాత్రం పొంగల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ఇది. వీరి కాంబోలో గతంలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకులను తెగ నవ్వించేశారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీతోమూవీతో వచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గలేదు.. మరి ఆరు రోజులకు గాను ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా ఈనెల 14 వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ బెనిఫిట్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలనే షాక్ అయ్యేలా చేసింది. హీరో వెంకటేష్ కెరీర్‌లోనే భారీ వసూళ్లను సాధించిన అతి పెద్ద మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ దుమ్ము దులిపేస్తుంది . ఈ మూవీలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.. ఈ చిత్రంలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ 80 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల టార్గెట్ , ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అదే విధంగా అలా ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. రిలీజ్ అయ్యాక ఒక్కరోజులోనే అంత రాబట్టింది. వెంకీ మామా లైఫ్ లో చూడని రికార్డు ను సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం..

ఇక ఈ మూవీ ఆరు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. 1300 స్క్రీన్ల లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది.. తొలి రోజు రూ. 45 కోట్లు అందుకుంది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి కేవలం 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అలవోకగా కొట్టేసి లాభాలను అందిస్తోంది.. సంక్రాంతి సెలవులు ఇంకా ఉండటంతో ఈ మూవీని చూడటానికి జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. నాలుగో రోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 25  కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. అంటే 131 కోట్లు రాబట్టింది. ఐదు రోజులకు 161 కోట్లు రాబట్టింది. ఆరు రోజులకు 185 కోట్లు రాబట్టింది. మరి ఏ మాత్రం వసూల్ చేసిందో చిత్ర యూనిట్ అధికారక ప్రకటన రావాల్సి.. మొత్తానికి ఈ మూవీతో వెంకీ మామా హిట్ ట్రాక్ లో పడ్డాడు. ఇదే జోరున కలెక్షన్స్ పెరిగితే రూ. 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని టాక్.. ప్రస్తుతం వెంకీ టీమ్ ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.. త్వరలోనే మరో సినిమాను అనౌన్స్ చెయ్యనున్నారని టాక్.. సంక్రాంతికి నవ్వించిన వెంకీ మామా ఈసారి భయపెట్టబోతున్నారని సమాచారం.. వెంకీ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×