OTT Movie : డిజిటల్ మీడియా విజ్ఞానంతో పాటు, వినోదంలో కూడా ముందు వరుసలో ఉంది. ఇందులో ఓటిటి ప్లాట్ ఫామ్ లో నచ్చిన సినిమాలను చూస్తూ ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. భాషతో ప్రమేయం లేకుండా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక నాట్యగత్తే చుట్టూ మూవీ స్టోరీ నడుస్తుంది. మంచి కంటెంట్ ఉన్న ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మరాఠి మూవీ పేరు ‘పుల్వంతి‘ (Phullwanti). 2024 లో విడుదలైన ఈ మరాఠీ మూవీకి స్నేహల్ తార్డే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో గష్మీర్ మహాజనితో పాటు టైటిల్ రోల్‌లో మాలి నటించారు. బాబాసాహెబ్ పురందరే రాసిన ఫుల్వంతి నవల ఆధారంగా, ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీ 11 అక్టోబర్ 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
పుల్వంతి తిరుగులేని నాట్యగత్తె గా పేరు తెచ్చుకుంటుంది. ఈమె నాట్యం చేసే రాజు దగ్గరికి, భీష్మ అనే ఒక రాజు సంబంధం కలుపుకోవడానికి వస్తాడు. పుల్వంతి నాట్యం చూసిన అతను పెళ్లికి కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, పుల్వంతి మా రాజ్యంలో నాట్యం చేయాలని ఆ రాజుని కోరుతాడు. అయితే పుల్వంతి తనకు నచ్చితేనే ఎక్కడైనా నాట్యం చేస్తుంది. అయితే రాజు ఆమెకు ఒక మాట చెప్తాడు. నువ్వు మరొక రాజ్యంలో నాట్యం చేయాలని, ఆ ప్రాంతంలో ఇదివరకే మస్తానీ అనే మహిళ నాట్యం చేసేదని చెప్తాడు. మస్తానీ పేరు చెప్పగానే పుల్వంతికి ఎక్కడలేని సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఆమెను తలుచుకునే పుల్వంతి నాట్యం నేర్చుకుని ఉంటుంది. ఈ క్రమంలో ఆ రాజు దగ్గరికి వెళ్లాడానికి నిర్ణయించుకుంటుంది. ఆ ప్రాంతంలో ఈమెను చూసిన అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పుల్వంతి అంత అందంగా ఉంటుంది. అదే ప్రాంతానికి శాస్త్రి అనే ఒక మంత్రి వస్తాడు. అప్పటిదాకా పుల్వంతిని చూసి జేజేలు కొట్టిన ప్రజలు, శాస్త్రీని చూడగానే ఆమెను మరిచిపోతారు. ఇదిచూసి పుల్వంతికి ఈగో హర్ట్ అవుతుంది. ఆ రాజభవనంలో పుల్వంతి నాట్యం చేస్తుండగా మధ్యలోనే శాస్త్రి వెళ్ళిపోతుంటాడు. పుల్వంతికి శాస్త్రి పై ఎక్కడలేని కోపం వస్తుంది.
ఈ శాస్త్రీ నన్ను అవమానించేలాగా చేస్తున్నాడని, అందుకు శిక్ష వేయాలని మహారాజుని అడుగుతుంది పుల్వంతి. నేను నాట్యం చేస్తుంటే మధ్యలోనే వెళ్లిపోయాడని, అది నన్ను అవమానించినట్లేనని చెబుతుంది. అంతేగాక నన్ను ఒక వ్యభిచారితో పోల్చాడని అంటుంది. అందుకు అక్కడ ఉన్న వాళ్లంతా పుల్వంతి మీద కోప్పడతారు. శాస్త్రి అలాంటివాడు కాదని, కావాలని నువ్వు అలా చెప్తున్నావు అని అంటారు. ఆ సమయంలో అందరికీ క్షమాపణ చెప్తాడు శాస్త్రి. నేను ఆమెను అవమానించిన మాట వాస్తవమేనని ఒప్పుకుంటాడు. అందుకు పుల్వంతి, శాస్త్రికి ఒక సవాల్ విసురుతుంది. నేను నాట్యం చేసేటప్పుడు శాస్త్రి తబలా వాయించాలని, నేను తప్పు చేస్తే అతనికి దాసి అవుతానని చెప్తుంది. అలాగే శాస్త్రి తప్పు చేస్తే గాడిద మీద ఊరేగాలని కోరుతుంది. ఈ సవాల్ కి శాస్త్రీ ఒప్పుకుంటాడు. అయితే తబలా ఎలా వాయించాలో కూడా తెలియని శాస్త్రి అయోమయంలో పడతాడు. తన గురువు దగ్గర ఒక రోజులో తబలా ఎలా నేర్చుకోవాలో తెలుసుకుంటాడు. ఈ క్రమంలో శాస్త్రి భార్య ఆలోచనలో పడుతూ భర్త గెలిచినా, ఓడినా తనకు నష్టమని బాధపడుతుంది. గెలిస్తే పుల్వంతి తన ఇంటికి వస్తుంది. ఓడితే తన భర్తకు అవమానం జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. చివరికి శాస్త్రి ఈ పందెంలో గెలుస్తాడా? పుల్వంతి, శాస్త్రిని ఓడిస్తుందా? వీరిద్దరి మధ్య స్టోరీ ఎక్కడికి దారి తీస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.