Sankranthiki Vasthunam Collection: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సంక్రాంతి బరిలో నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఊహించని విధంగా దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ రివ్యూలతో, అదిరిపోయే మౌత్ టాక్‌తో సినిమా ఈ పండగక్కి బంపర్ హిట్‌గా నిలవనుందిబాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. పండగకి వచ్చారు.. పండగ తెచ్చారు అంటూ డే 1 కలెక్షన్స్ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు.. ఇప్పుడు రెండో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా వసూల్ చేసిందని తెలుస్తుంది. మరి రెండు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..
గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలోకి వచ్చిన హీరో వెంకటేష్ నుంచి వచ్చిన ప్రతి సినిమా హిట్ టాక్ ను అందుకుంటుంది. వెంకటేష్ కెరీర్ లోనే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఆల్ టైమ్ కెరీర్ హయ్యెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. నిజానికి ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలని మించి సినిమా డే 1 కలెక్షన్లు రాబట్టింది. పండగ హడావిడి ముగిసేలోపు సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌లో సినిమాపై మంచి అభిప్రాయం ఏర్పడింది. దీనికి తోడు రివ్యూలు కూడా బ్లాక్ బస్టర్ అనడంతో థియేటర్లకి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ షో వరకూ ప్రతి చోటా కుటుంబ ప్రేక్షకులు కనిపించడం విశేషం. మొత్తానికి గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం మూవీ మళ్ళీ ఆశలు రేపింది. బాక్సాఫీస్ వద్ద హైప్ ను పెంచుతుంది..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన F2, F3 రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంతకంటే పెద్ద హిట్‌గా నిలవబోతుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక వెంకీ డీలా పడ్డారు.. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజు 45 కోట్లు వసూల్ చేసింది. రెండో రోజు మరో 30 కోట్లు వరకు వసూల్ చేసిందని సమాచారం. ఇక మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజే ఈ సినిమా రూ.20.51 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 50 శాతం రికవరీ సాధించినట్టే. ఇక బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.20.49 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది..