E-Paper
Advertisement

OTT Movie : 11 ఏళ్లకే పెళ్లి, 12 ఏళ్లకే భర్త పోతే… లేటు వయసులో ఆత్మగా మారి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : 11 ఏళ్లకే పెళ్లి, 12 ఏళ్లకే భర్త పోతే… లేటు వయసులో ఆత్మగా మారి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో, ఇప్పుడు బెంగాల్ సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తున్నాయి. హర్రర్ కామెడీతో వచ్చిన ఒక మూవీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీలో 11 సంవత్సరాల వయసులోనే పెళ్లయిన ఒక అమ్మాయి, సంవత్సరం దాటకుండానే విధవరాలు అవుతుంది. ఆమె ఆత్మగా మారి, ఆమె చేసే పనుల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ హర్రర్ కామెడీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

Advertisement

ఈ బెంగాల్ హర్రర్ కామెడీ మూవీ పేరు ‘గోయ్నార్ బక్షో‘ (Goyanar Baksho). అపర్ణ సేన్ దర్శకత్వం వహించిన ఈ బెంగాలీ హర్రర్ కామెడీ మూవీని   ‘గోయ్నార్ బక్షో’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ హర్రర్ కామెడీ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రష్మీ అనే అమ్మాయికి చిన్న వయసులో, ముసల వయసు జమీందారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే సంవత్సరం తిరక్కుండానే అతడు చనిపోతాడు. రష్మీ చిన్న వయసులోనే విధవరాలు అవుతుంది. ఒంటరిగా గడుపుతున్న ఈమెకు, ఇంట్లో పని వాడి మీద మనసు వెళుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె అన్నయ్యలు అతన్ని చంపేస్తారు. అప్పట్నుంచి ఒంటరిగానే మిగిలిపోతుంది. రష్మీకి తన నగలు పెట్టి అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత రష్మీకి కూడా ముసలి వయసు వస్తుంది. తన తమ్ముడు కొడుక్కి, సుమలత అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఇంతలోనే రష్మీ నిద్రలోనే చనిపోతుంది. ఆమె ఆత్మ నగలు పెట్టిన వదిలి వెళ్ళలేక అక్కడే ఉంటుంది. వాటిని సుమలతకు ఇచ్చి భద్రంగా చూసుకోమని చెప్తుంది. సుమలతకు మాత్రమే కనిపిస్తూ, నగలపెట్టి జోలికి ఎవరూ రాకుండా చూస్తుంది రష్మీ ఆత్మ.

ఒకరోజు సుమలత నగలపెట్టిలోని, కొన్ని నగలు తీసుకొని శారీ బిజినెస్ చేస్తుంది. ఇది చూసి రష్మీ ఆత్మ కోప్పడుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే తిరిగి నగలను తీసుకొస్తానని మాట ఇస్తుంది. బిజినెస్ బాగా జరగటంతో, తాకట్టు పెట్టిన నగలు తీసుకుని మళ్ళీ వస్తుంది. అప్పుడు రష్మీ ఆత్మ సంతోషి స్తుంది. సుమలత కూతురు, ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆమెతో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో, ఎటైనా వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు రష్మీ ఆత్మ సుమలతకి సహాయం చేస్తుంది. సుమలత కూతురికి రష్మీ ఎటువంటి సాయం చేస్తుంది? రష్మీ ఆత్మ ఆ నగలను విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? మరి ఎవరికైనా రష్మీ ఆత్మతో ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గోయ్నార్ బక్షో’ (Goyanar Baksho) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×