Sankranthiki vastunnam Collections : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 14 న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనేలా హీరో సినిమాలు ఉంటాయి. అలాగే ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మూవీ రోజులు గడుస్తున్న కూడా బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తూనే ఉంది. రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ.. తాజాగా తొలి వారంలోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీ రోజువారీ కలెక్షన్స్ గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం..
స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ అయింది వెంకీ మూవీ. జనవరి 14 న రిలీజైన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి వారంలోనే 200 కోట్లు వసూల్ చేసి అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో గతంలో రూ.180 కోట్లతో అలవైకుంఠపురంలో మూవీ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.. ఇది వెంకీ మామాకు ఆల్ టైమ్ పొంగల్ రికార్డ్.. ఇదే జోరు ఇంకా కనబడుతుంది.. వర్కింగ్ డేస్ ఉన్నా కలెక్షన్స్ ఎక్కడా తగ్గలేదు.
ఈ మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ మూవీ మొత్తం కలెక్షన్స్ ను చూస్తే.. తొలి రోజు రూ. 45 కోట్లు అందుకుంది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి కేవలం 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం.. నాలుగో రోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 25 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. అంటే 131 కోట్లు రాబట్టింది. ఐదు రోజులకు 161 కోట్లు రాబట్టింది. ఆరు రోజులకు 185 కోట్లు రాబట్టింది. ఇక ఏడు రోజులకు 203 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఎనిమిదోవ రోజు 213 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇదే విధంగా మరి కొద్ది రోజులు రన్ అయితే మాత్రం 500 కోట్లు రాబడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. వెంకీ మామ నటించిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిందని చెప్పాలి.. మొత్తానికి వెంకీ ఖాతాలో పొంగల్ రికార్డ్ పడింది..