BigTV English

Tik Tok Lion Attack : వైరల్ వీడియో కోసం సింహంతో ఆటలు.. పాకిస్తానీపై పంజా విసిరిన మృగరాజు

Tik Tok Lion Attack : వైరల్ వీడియో కోసం సింహంతో ఆటలు.. పాకిస్తానీపై పంజా విసిరిన మృగరాజు

Tik Tok Lion Attack | సింహాన్ని అందరూ అడవికి రాజుగా పిలుస్తుంటారు. అలాంటి కృూర మృగంతో ఆటలాడేందుకు వెళ్లాడు ఒక యువకుడు. సింహం బోనులో ప్రవేశించి మరీ దాంతో సెల్ఫీ వీడియోకు ప్రయత్నించాడు. అంతే ఇక చెప్పేదేముంది.. అతడికి జీవితాంతం గుర్తుండి పోయే సెల్ఫీనిచ్చింది.. ఆ సింహం. యువకుడికి తన పంజా దెబ్బ రుచి చూపించింది. దీంతో ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోదామనుకొని వైరల్ వీడియోల కోసం ఇటీవల చాలామంది యువతీ యువకులు స్టంట్లు చేస్తున్నారు. ఈ కోవకు చెందినవాడే పాకిస్తాన్ కు చెందిన ముహమ్మద్ అజీమ్. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన అజీమ్ టిక్ టాక్ షార్ట్ వీడియోలు చేస్తుంటాడు. అతని వీడియోలు వెంటనే వైరల్ కావడానికి సాహసాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల లాహోర్ నగరంలోని ఒక జంతు సంరక్షణకు వెళ్లాడు. అక్కడ బోనులో ఉన్న సింహాన్ని చూసి.. దాంతో సెల్ఫీ వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో టిక్ టాక్ లో పెడితే వైరల్ అవుతుందని అజీమ్ భావించాడు.

అందుకే ఈ ఏ మాత్రం సంకోచించకుండా సింహం బోనులోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడ సమీపంలో జూ సంరక్షకులు ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన అజీమ్ సింహం బోనులోకి వెళ్లి దాన్ని పలకరించాడు. అయితే ఆ సింహం.. అజీమ్ రాకతో అతని వైపు కోపంగా చూసింది. కానీ అజీమ్.. దాన్ని తక్కువ అంచనా వేశాడు. బోనులో సింహం కదా.. ఏం చేయదులే నని భావించి దాని వైపు తన వీపు తిప్పి తన సెల్ ఫోన్ లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు.


కృూర మృగాలు తమ ఎదుట ఏవైనా సాధు జంతువులు లేదా మనుషులు వీపు చూపిస్తే.. వెంటనే దాడి చేస్తాయి. బోనులో సింహం కూడా అదే చేసింది. అజీమ్ వీపుపై పంజాతో ఒక దెబ్బ వేసింది. ఆ తరువాత అతని మెడ, చేతులను కొరికేసింది. దీంతో అజీమ్ కేకలు వేశాడు.

Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు

అతని కేకలు విని జూ సంరక్షకులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజీమ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పాకిస్తాన్ మంత్రి మరియం ఔరంగజేబ్ స్పందించారు. సదరు జంతు సంరక్షణ కేంద్రం యజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే ఆ కేంద్రంలో కృూర మృగాల బ్రీడింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

సింహాలు, పులులు, చిరుతపులులు, జాగ్వార్, ప్యూమా లాంటి అయిదు రకాల జాతుల మృగాల సంరక్షణకు సంబంధించి కఠిన చట్టాలున్నాయని.. వాటిని పాటించనివారిపై కఠిన చర్యల చేపడతామని చెప్పారు. ఈ కృూరమృగాలను నగర పరిధికి దూరంగా ఉంచాలని ఆదేశించారు. టిక్ టాక్ లేదా ఇతర సోషల్ మీడియో యాప్ లలో కృూర మృగాలపై వీడియోలు చేయకుండా ఇప్పటికే నిబంధనలున్నాయని.. వాటిని ఉల్లంఘించివారిపై కేసులు నమోదు చేసి శిక్షిస్తామని ఆమె అన్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×