Sankranthiki Vasthunam Collections : విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ ని కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా చివరగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేర్ చేస్తుంది. కోట్లు వసూలు చేస్తుంది. ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీ్స్‌లో సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది.. అక్కడ కూడా వసూళ్ల మోత మోగిపోతుంది.. అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి అక్కడి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
వెంకీ మామా ఆల్ టైం పొంగల్ రికార్డు ను బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షనలతో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ మూవీ ఓవర్సీస్ లో ఇప్పటికే 350K డాలర్ల వసూళ్లు రాబట్టింది. అటు యూకే బాక్సాఫీస్ వద్ద 200K పౌండ్లు వసూళ్లు రాబట్టింది.. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణల శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ కేవలం రెండు రోజుల్లో 100 కోట్లను వసూల్ చేసింది. 500 కోట్ల క్లబ్ లోకి పరుగులు పెడుతుంది.. 7 రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ మూవీ మొత్తంగా 1300 స్క్రీన్ల లో రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచి మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది.. తొలి రోజు రూ. 45 కోట్లు అందుకుంది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.29 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి కేవలం 3 రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం.. నాలుగో రోజు కూడా కలెక్షన్స్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 25 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. అంటే 131 కోట్లు రాబట్టింది. ఐదు రోజులకు 161 కోట్లు రాబట్టింది. ఆరు రోజులకు 185 కోట్లు రాబట్టింది. ఇక ఏడు రోజులకు 200 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తుంది. మరి అంతకు మించి వసూల్ చేసిందేమో మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఇక ఇదే జోరు రన్ అయితే మరి కొద్ది రోజుల్లోనే 500 కోట్లు వసూల్ చెయ్యడం పక్కా అని వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఈ సినిమా లో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు..