BigTV English

Sankranti Movies 2024 : సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గుతున్న మాస్ మహరాజ్.. అసలు కారణం అదేనా?

Sankranti Movies 2024 : సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గుతున్న మాస్ మహరాజ్.. అసలు కారణం అదేనా?

Sankranti Movies 2024 : సంక్రాంతి పండుగ వస్తుంది అంటే సినిమా లవర్స్ కు డబుల్ పండగ. మామూలు టైంలో రిలీజ్ అయ్యే మూవీస్ కంటే కూడా సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సంక్రాంతి టైంలో విడుదలయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా సరే ఇక ఆ చిత్రం పంట పండిందని అర్థం. మంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇక బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవాల్సిందే. అలా ఉంటుంది సంక్రాంతి సినిమా సంబరం. అందుకే పెద్ద హీరోలు సంక్రాంతికి సై అంటే సై అంటూ బరిలోకి దిగుతారు.


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసుకొని తన బ్యానర్ నుంచి కనీసం ఒక సినిమా నైనా పండక్కి దించుతాడు. మరి సంక్రాంతికి ఉన్న డిమాండ్ అలాంటిది. చాలావరకు సంక్రాంతికి సినిమా చూడాలి అనేది తెలుగు ప్రేక్షకులు ఒక పండగ సాంప్రదాయంగా మార్చేసుకున్నారు. పైగా సెలవులు కాబట్టి ఫుల్లుగా మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. అందుకే ఈ సీజన్ వచ్చిన కలెక్షన్స్ ఏ సీజన్లోనూ కనిపించవు. అయితే ఈసారి సంక్రాంతికి పోటీ చాలా గట్టిగా ఉంది. సుమారు అరడజను పైగా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని ఉన్నాయి.

ఇందులో మొదట ఉన్నది మహేష్ బాబు గుంటూరు కారం. ఈ మూవీ అనుకుంది మొదలు ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంది. హీరోయిన్ మార్చడం దగ్గర నుంచి ప్రతి విషయం కాంట్రవర్సీ అయినప్పటికీ మూవీకి బజ్ మాత్రం ఏమి తగ్గడం లేదు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న బరిలోకి దిగుతుంది. ఇక నాగార్జున కూడా ఈసారి సంక్రాంతికి నా సామిరంగా అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక దిల్ రాజ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని పండుగ రేస్ లోకి తీసుకువచ్చాడు.


ఇప్పటివరకు రౌడీ బాయ్ గా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ పక్క ఫ్యామిలీ మ్యాన్ గా ఈ ఫ్యామిలీ స్టార్ మూవీలో కనిపించనున్నాడు. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చిత్రం పై మంచి బజ్ క్రియేట్ చేసింది. వీటితో పాటుగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మాస్ మహారాజ్ నటిస్తున్న ఈగల్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది అని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి సరికొత్త అప్డేట్ మూవీ రిలీజ్ పై సందేహాలను పెంచుతుంది. రవితేజ ఎందుకో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని జనవరి 26 కు పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు టాక్. అదేరోజున “తంగలాన్ ”అనే డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. మొత్తానికి సంక్రాంతి హడావిడికి థియేటర్లు దొరుకుతాయో లేదో అన్న అనుమానంతో మాస్ మహారాజ్ వెనక్కి తగ్గినట్లు ఉన్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×