BigTV English

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవత­రణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యా­లయంలో సీఎం వైఎస్ జగన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేశారు. అమరజీవికి నివాళులు అర్పించారు.


మరోవైపు ఏపీవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏపీలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం జూన్ 2న నవ నిర్మాణ దీక్ష నిర్వహించింది.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×