Jabardast Varsha : బుల్లితెర పై ప్రసారం అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడీయన్స్ జీవితంలో పైకొచ్చారు. వరుస సినిమాలను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు షోలల్లో మెరుస్తూ సందడి చేస్తున్నారు. అలాంటి నటుల్లో జబర్దస్త్ వర్ష ( Jabardast Varsha ) ఒకటి. ఈమె ఎన్నో స్కిట్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర పై పలు షోలల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల మోనాలిసా గెటప్ లో కనిపించింది. ఆ షో వీడియో వైరల్ అవ్వడంతో ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే వర్ష అమ్మాయినా? లేదా అబ్బాయినా? ఇలాంటి డౌట్స్ అందరికి వస్తుంటాయి. తాజాగా బుల్లితెర హీరో ఆమె పరువును అడ్డంగా తీసేసాడు. అసలేం అన్నాడో ఒకసారి చూద్దాం..
అసలు మ్యాటర్లోకి వెళితే.. టాలీవుడ్ యాక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. బిగ్‌బాస్ 7 రన్నరప్ అమర్‌దీప్ చౌదరి (Amardeep Chowdary)తో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది.. అయితే ఈమె ఈ మధ్య ఓ షోకు హోస్ట్ గా మారింది. పీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో చేస్తోంది. తాజాగా ఈ షోకు నటుడు అమర్‌దీప్, కమెడియన్ వర్ష అతిథులుగా విచ్చేశారు. సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రితను ఎవ్వరూ ఆపలేరు అని డైలాగ్ వేసింది.. అలాగే అమర్ కూడా తన స్టైల్లో పంచులు వేశారు. సుప్రీత పై ప్రశంసలు కురిపించారు.
Also Read : తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాను .. గుడ్ న్యూస్ చెప్పిన సామ్..
ఈ క్రమంలో వర్షను ఎన్నో ప్రశ్నలు అడిగింది సుప్రిత.. అన్నిటికి సమాధానం చెప్పిన వర్ష ఒక్క మాటతో షాక్ అయ్యింది. మీరు అమ్మాయా? అబ్బాయా? అని వర్షను ప్రశ్నించింది. అందుకామె.. నేను అమ్మాయిని కాదనుకుని ఒక పార్లర్‌లోనికి పంపించలేదని తెలిపింది. ఎంత డౌట్ వస్తే అలా చేసుంటారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత ఓ సంఘటన జరిగింది కదా.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అని సుప్రిత అడిగింది. దానికి అమర్ సమాధానం చెప్పాడు. ఆరోజు నేను నా కుటుంబంతో రోడ్డు మీద నిల్చున్నాను. నేనేం చేయాలనుకుంటున్నానో ఆ దారిలో వెళ్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఇలాంటివి నథింగ్ అంటూ సమాధానం చెప్పాడు. మొత్తానికి అమర్ తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించి కన్నీళ్లు తెప్పించాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో వర్ష పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమర్ డీప్ తెలుగు బుల్లితెర పై సీరియల్స్ చేశారు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఫైనల్ వరకు చేరుకున్నాడు. ప్రస్తుతం సీరియల్స్ కన్నా సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.