BigTV English

Sam Altman Baby Born : శామ్ ఆల్ట్‌మాన్‌కు మగబిడ్డ.. తొలి సంతానానికి ఆహ్వానం పలికిన చాట్‌జిపిటి బాస్

Sam Altman Baby Born : శామ్ ఆల్ట్‌మాన్‌కు మగబిడ్డ.. తొలి సంతానానికి ఆహ్వానం పలికిన చాట్‌జిపిటి బాస్

Sam Altman Baby Born | చాట్ జీపిటి మాతృక అయిన ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్‌ ఆదివారం తండ్రి అయ్యారు. ఆయనకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. తన బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు.


“ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!” అని పేర్కొంటూ, తన బిడ్డ కాస్త ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం.. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. “నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదు” అని ఆయన తన మనోభావాలను వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ల
శామ్ ఆల్ట్‌మాన్‌ ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. “నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్‌హుడ్ (తండ్రి కావడం) అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనేక మంది నెటిజన్లు కూడా శామ్ ఆల్ట్‌మాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


Also Read: ఊగిసలాడుతున్న రూ.4.5 కోట్ల లాటరీ.. విజేత ఒక దొంగ.. మరి ఇప్పుడెలా?

శామ్ ఆల్ట్‌మాన్‌ వ్యక్తిగత జీవితం
శామ్ ఆల్ట్‌మాన్‌ సెప్టెంబర్ 2023లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ స్వలింగ సంపర్కులే. ఈ గే జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. శామ్ ఆల్ట్‌మాన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతారు.

2023లో భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇచ్చిన డిన్నర్ పార్టీలో శామ్ ఆల్ట్‌మాన్ తన జీవిత భాగస్వామి ఆలివర్ తో కలిసి వచ్చారు. అయితే ఇప్పుడు శామ్ ఆల్ట్ మ్యాన్ తండ్రి కావడంతో ఆయన సంతానం కోసం ఎవరైనా మహిళను సరోగేట్ గా చేసుకున్నారా? అనే అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. దీనిపై ఇంతవరకు శామ్ స్పష్టత ఇవ్వలేదు.

అయితే శామ్ ఆల్ట్ మ్యాన్ తండ్రి కాబోతున్నట్లు బ్లూంబర్గ్ అనే అంతర్జాతీయ మీడియా జనవరి 2025లోనే తెలిపింది. ఆయనకు మార్చి నెలలో తొలి సంతానం జన్మించే అవకాశం ఉన్నట్లు కూడా వెల్లడించింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 2025లోనే అంటే ఒక నెల రోజుల ముందే శామ్ కు కొడుకు పుట్టాడు. అందుకే బిడ్డ కాస్త ముందుగానే జన్మించాడని.. అందువల్ల కొన్ని రోజుల పాటు బిడ్డ ఆరోగ్యం కుదుటపడే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని శామ్ చెప్పారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×