BigTV English

SVSC Re-Release: మళ్లీ థియేటర్లలోకి క్లాసిక్ మూవీ.. రీరిలీజ్ ఎప్పుడంటే..?

SVSC Re-Release: మళ్లీ థియేటర్లలోకి క్లాసిక్ మూవీ.. రీరిలీజ్ ఎప్పుడంటే..?

SVSC Re-Release: ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న కొన్ని సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే గతంలో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ రావడం విశేషం.. తాజాగా మరో రెండు భారీ మూవీస్ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటో? ఎప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..


SVSC రీరిలీజ్.. 

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), వెంకటేష్ ( venkatesh) కలిసి నటించిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు.. టాలీవుడ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ఇది.. ఇద్దరు స్టార్ హీరోలు అన్నదమ్ములుగా నటించిన బ్లాక్‌బస్టర్ గా చరిత్ర సృష్టించింది. అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబంలోని రిలేషన్స్ కు డబ్బులకు సంబంధం లేదు.. మనిషికి చివరికి శాశ్వతమైంది కుటుంబం, ఆత్మీయలే అని ఎంతో చక్కగా చూపించారు. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మించారు. 2013 సంక్రాంతి పండుగని పురస్కరించుకుని విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.. అయితే ఇప్పుడు మళ్లీ ఈ మూవీ రీరిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారు.. మార్చి 7 న మూవీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.


మళ్లీ థియేటర్లలో కల్ట్ క్లాసిక్ మూవీ విడుదల కానుంది.. దీనితో వెంకటేశ్, మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీని మరోసారి పెద్ద స్క్రీన్ పై చూడటానికి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. రీ రిలీజ్ తర్వాత మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మహేష్ బాబు వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. 300 కోట్లకు పైగా వసూల్ చేసింది. తాజాగా మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×