E-Paper
Advertisement

OTT Movie : శోభనం అంటే భయపడే భార్య… బలవంతంగా కోర్కెలు తీర్చుకునే భర్త …

OTT Movie : శోభనం అంటే భయపడే భార్య… బలవంతంగా కోర్కెలు తీర్చుకునే భర్త …
Advertisement

OTT Movie  :  “పెళ్లి” దాని అర్థం అంటే ఏమిటో తెలియకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎప్పటినుంచో ఈ ఆచారం వస్తూనే ఉంది. అయితే భారతదేశంలో దీనికి చాలా విలువ ఇస్తారు. చాలా దేశాలలో పెళ్లిళ్లు బర్త్డే పార్టీ లాగా జరిగిపోతుంటాయి. అలాగే విడిపోతూ ఉంటారు. మన సాంప్రదాయంలోనే పెళ్లి తరువాత అమ్మాయిలు వంట గదికే పరిమితం అవుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి పడే, ఒక రకమైన మానసిక హింస చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

జి ఫైవ్ (Zee 5) లో

Advertisement

ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘మిసెస్’ (Mrs). 2024లో విడుదలైన ఈ బాలీవుడ్ డ్రామా మూవీకి ఆరతి కడవ్ దర్శకత్వం వహించారు. ఇది 2021 లో వచ్చిన  మలయాళ మూవీ  ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ కి రీమేక్. ఇందులో సన్యా మల్హోత్రా కొత్తగా పెళ్లైన మహిళ పాత్రలో నటించి మెప్పించింది. నిశాంత్ దహియా, కన్వల్జిత్ సింగ్ ఈ మూవీలో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రీచా పెళ్లి కాకముందు సరదాగా డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఆమెకు డాన్స్ అంటే ప్రాణం. పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయాలనుకుంటుంది. రీచాకి దివాకర్ అనే డాక్టర్ తో పెళ్లి అవుతుంది. అందరి అమ్మాయిల్లాగానే అత్తారింటికి వెళ్తుంది. తన అత్తగారు వంటింట్లో పని చేసుకుంటూ ఎక్కువగా గడుపుతూ ఉంటుంది. మొదటి రాత్రి బాగానే జరుగుతుంది. రెండో రోజు ఆ పనికి కాస్త రెస్ట్ కావాలని అడుగుతుంది. భర్త మాత్రం ఆమెపై కామంతో, ఆమె చెప్పేది వినకుండా అలాగే ప్రొసీడ్ అవుతాడు. అందుకు రిచా బాధపడుతుంది. ఒకరోజు అత్తగారు కూతురు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటినుంచి రీచా వంటింటి కుందేలు అయిపోతుంది. తన బాధను మాత్రం ఎవరూ పట్టించుకోరు. వంట రుచిగా చేసినా కూడా మెచ్చుకోరు. రాత్రి వరకు పనిచేసుకుంటూనే ఉంటుంది రీచా.

భార్య బాగా అలసిపోయినా అవేమీ పట్టించుకోకుండా తన కోరికలను తీర్చుకుంటూ ఉంటాడు భర్త. రీచాకి ఎక్కడలేని కోపం వస్తూ ఉంటుంది. ఒకరోజు యూట్యూబ్లో ఉన్న తన డాన్స్ వీడియోలను తీసేయమని భర్త చెప్తాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. ఇంట్లో కిచెన్ లో వాటర్ బాగా లీక్ అవుతూ ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా అది కూడా పట్టించుకోడు భర్త. ఇంటికి గెస్ట్లు చాలామంది వస్తారు. వాళ్లకు కాఫీ ఇవ్వాలని గట్టిగా చెప్తాడు భర్త. అప్పుడు ఆమె లీకైన మురికి నీళ్లను తెచ్చిస్తుంది. అప్పుడు భార్యను కొట్టబోతాడు భర్త. ఆ మురికి నీళ్ళని భర్త మొఖాన కొట్టి పుట్టింటికి వెళ్ళిపోతుంది రీచా. చివరికి రీచా భర్తను వదిలేస్తుందా? డాన్స్ అకాడమీని పెట్టుకుంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×