Sekar Mastar : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఆయన కంపోజ్ చేసిన కొన్ని హుక్ స్టెప్పులు వివాదాలకు కేరాఫ్ గా మారాయి. మొన్న వచ్చిన రాబిన్ మూవీలో కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. అందులో ఒక స్టెప్ జనాలకు బూతులాగా కనిపిస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ ఆ విమర్శల పై స్పందించి క్లారిటీ ఇస్తున్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాస్టర్ రాఘవ లారెన్స్ మాస్టర్ పై షాకింగ్ విషయాలను బయట పెట్టాడు.. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
లారెన్స్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ కామెంట్స్..
తమిళ స్టార్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు సూపరచితమే.. తెలుగులో పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడంతో పాటుగా కొన్ని సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ముని వంటి హారర్ సినిమాలలో నటించడంతోపాటు డైరెక్టర్ గా వ్యవహరించిన లారెన్స్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన సినిమాల్లో హీరో కన్నా కొరియోగ్రాఫర్ గా చేసిన సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేసినప్పుడు ఆయన దగ్గర శేఖర్ మాస్టర్ పనిచేశారన్న విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
ఇక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. లారెన్స్ మాస్టర్ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు. ఎక్కడో వెనుక వరుసలో ఉండి డాన్స్ చేస్తున్న నన్ను ముందుకు పిలిపించి ఒక స్టెప్ ని వేయించాడు. అది చాలా బాగా వచ్చింది అప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యమే ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయిందని శేఖర్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.. ఆ తర్వాత సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కొంతమంది స్టూడెంట్స్ కి డాన్స్ నేర్పిస్తూ లారెన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకునే వాడినని అన్నారు.. ఏది ఏమైన లారెన్స్, సుచిత్ర మాస్టర్స్ తనలోని టాలెంట్ ను గుర్తించి ఎంకరేజ్ చేశారని అన్నాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో శేఖర్ మాస్టర్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
శేఖర్ మాస్టర్ పై స్టెప్పుల పై వివాదాలు..
హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్‌లో అసలే హీరో హీరోయిన్ల వయసుపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. 56 ఏళ్ల రవితేజకి 25 ఏళ్ల అమ్మాయికి మధ్య ఇలాంటి స్టెప్స్, రొమాంటిక్ సీన్స్ పెడతారా అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.. ఈ మధ్య రిలీజ్ అయిన నితిన్ మూవీ రాబిన్ హుడ్ లో అలాంటి స్టెప్ ఉంటుంది.. అదిదా సర్ ప్రైజ్ అనే విమర్శలు అందుకుంది. దానిపై మాస్టర్ వివరణ ఇచ్చారు. నేను స్టెప్ కంపోజ్ చేస్తే సినిమా యూనిట్ ఒకే అన్నాకే సాంగ్ చేస్తాము. నా తప్పు లేదు అని అన్నాడు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కొరియోగ్రాఫర్ అయ్యారు.. మరో నాలుగు సినిమాలు ఆయన చేతిలో ఉన్నట్లు సమాచారం..