Babloo Pruthveeraj : అప్పటిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా, హీరోగా, హీరో ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో పృథ్వీ రాజ్ ఒకరు. ఒకవైపు వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టైంలోని ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఏ క్షణాన ‘యానిమల్’లో నటించారో గానీ వరసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు.. అయితే ఈ నటుడు ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ తన లైఫ్ లో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాడు. తాజాగా ఓ సినిమా కోసం ఆయన చేసిన రిస్క్ గురించి బయట పెట్టాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇంత మూర్ఖత్వం పనికి రాదు అంటూ కామెంట్స్ అందుకున్నాడు.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..
రీసెంట్ మూవీస్..
తండేల్, సంక్రాంతికి వస్తున్నాం, అర‍్జున్ సన్నాఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు. అలాగే కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది గానీ పృథ్వీ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఆయన ఓ సినిమా కోసం చేసిన రిస్క్ ను బయటపెట్టాడు.. అది విన్న ఆయన ఫ్యాన్స్ సినిమా పై ఆయనకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చాడు.
45 రోజుల్లో 18 కేజిలు తగ్గాడు..
సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే.. ఆ పాత్రకు తగ్గట్లు ల్యాంగ్వేజ్ తో పాటుగా బాడీని కూడా ఉండేలా చూసుకుంటారు. అందుకే సినిమాలో నటించేవాళ్లు ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం వర్కౌట్ లను చేస్తుంటారు. అలాగే సినీ నటుడు పృథ్వి కూడా ఎప్పుడు ఫిట్ గా కనిపిస్తాడు.. అయితే తాజాగా ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూలో ఓ మూవీ కోసం దాదాపుగా 18 కిలోలు తగ్గినట్లు చెప్పాడు. ఆ మూవీ పేరు బలమేవ్వడు.. ఈ సినిమాలో ఫిట్ గా కనిపించాలని కేవలం 45 రోజుల్లో 18 కిలోలు తగ్గినట్లు ఆయన అన్నారు. ఇది విన్న నెటిజన్లు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిస్తున్నారు.
Also Read: లారెన్స్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్..నిజంగా గ్రేట్ కదా..!
పృథ్వికి అవమానం..
దిలీప్ ప్రకాష్-రెజీనా జంటగా, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఉత్సవం సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. కోవిడ్ ముందు చిత్రీకరణ పూర్తైన పలు కారణాల వలన వాయిదా పడింది..ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందరిని పలకరించాను. కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. స్టేజ్ పైకి పెద్ద నటులు మొదలు మేకప్ ఆర్టిస్టుల వరకు అందరిని పిలిచి తనను మాత్రం పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడితో మాట్లాడుతుండగా కావాలని వచ్చి ఆయన్ని ఒకరు పిలుచుకొని వెళ్లారని పృథ్వీ అన్నాడు. ఈవెంట్ అంతా ముగిశాక గ్రూప్ ఫొటో కోసం అందరిని పిలిచారు. తనను కావాలని వెనుక వరుసలో నిలబెట్టారని పృథ్వీరాజ్ బాధపడ్డాడు.. ఆ తర్వాత మెల్లగా సినిమాలకు దూరమై ఇప్పుడు మళ్లీ నాకు గౌరవం ఉన్న దర్శకుల దగ్గరే సినిమా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.