Allu Arjun:సాధారణంగా ఏ హీరో అయినా సరే.. ఎప్పుడూ టచ్ చేయని జానర్ లో సినిమా చేశారు అంటే కచ్చితంగా టెన్షన్ పడతారు. ముఖ్యంగా ఆ జానర్ లో తాము నటించాము.. ప్రేక్షకులను మెప్పించగలమా? లేదా.? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. సరిగ్గా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారట రెబల్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas). అంతేకాదు ఆ సమయంలో ఒక స్టార్ హీరో.. ప్రభాస్.. నీ సినిమా చూసి మా ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది” అని చెప్పడంతో ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పుష్ప -2 తో ప్రేక్షకుల ముందుకు..
ఆ స్టార్ హీరో ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). డిసెంబర్ ఐదవ తేదీన సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప -2(Pushpa 2)విడుదల కాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అని అభిమానులతో పాటూ సినీ సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ వృత్తి గత జీవితానికి ఎంత ప్రయారిటీ అయితే ఇస్తారో.. వ్యక్తిగత జీవితానికి కూడా అంతే టైం ఇస్తారు. ముఖ్యంగా సమయం దొరికితే చాలు తన భార్య స్నేహారెడ్డి Allu Snehareddy), పిల్లలతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఇక అల్లు స్నేహారెడ్డి కూడా తన భర్త, పిల్లలతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
నెలల వ్యవధి తేడాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, బన్నీ..
ఇకపోతే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం కొన్ని నెలల తేడాతోనే వీరిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ కూడా బాగా పెరిగిపోయింది. సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ప్రభాస్ బంగారం అంటూ అల్లు అర్జున్ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా గతంలో అల్లు అర్జున్ – ప్రభాస్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దిల్ రాజు (Dilraju)నిర్మాణంలో ప్రభాస్ నటించిన చిత్రం ‘మిస్టర్ పర్ఫెక్ట్’.
బన్నీ భార్య ఎమోషనల్.. ప్రభాస్ మూవీ హిట్..
ఏ సినిమా విషయంలో టెన్షన్ పడని ప్రభాస్, ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడ్డారట. ఎందుకంటే ఇది కుటుంబ కథా చిత్రం. భారీ ఫైట్స్ లాంటివి ఉండవు.. ఓన్లీ ఎమోషన్స్.. ఆడవారికి కనెక్ట్ అయితేనే సినిమా హిట్, లేకుంటే షాక్ తప్పదు అని అనుకున్నారట ప్రభాస్. అయితే ఈ సినిమాను విడుదల చేయడానికంటే ముందే సెలబ్రిటీల కోసం దిల్ రాజు రివ్యూ వేశారు. అయితే ప్రభాస్ మాత్రం ఈ ప్రివ్యూ చూడడానికి రాలేదట. ఈ సినిమా ప్రివ్యూ చూడగానే.. “అల్లు అర్జున్ మొదట ప్రభాస్ కి ఫోన్ చేసి సినిమా అదిరిపోయింది. డార్లింగ్ ఫస్ట్ ఆఫ్ సూపర్ గా ఉంది. సెకండ్ ఆఫ్ ఇంకా బాగుంది”అని చెప్పారట. అయితే ప్రభాస్ మాత్రం “మనకి నచ్చడం కాదు లేడీస్ కి నచ్చాలి. అసలు ఈ సినిమా వాళ్లకి నచ్చితేనే సూపర్ హిట్” అంటూ తన అభిప్రాయంగా చెప్పారట. అంతేకాదు మీ వైఫ్ కి నచ్చిందా? అని కూడా అడిగారట ప్రభాస్. ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ..”చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ చూసి ఆమె ఒకటే ఏడుపు” అంటూ తెలిపారట అల్లు అర్జున్. “లేడీస్ కి కనెక్ట్ అయితే చాలు, సినిమా సూపర్ హిట్ అని అనుకున్నారట ప్రభాస్”. అలా అల్లు అర్జున్ భార్య ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యింది.. ఆడవారికి నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్ అయింది అంటూ ప్రభాస్ తెలిపారు. ఇకపోతే అల్లు అర్జున్ కూడా వెంటనే సూపర్ హిట్ రాదు.. మెల్లిగా పుంజుకుంటుంది అని చెప్పారట. బన్నీ చెప్పినట్టుగానే ఈ సినిమా నెమ్మదిగా పుంజుకుంటూ భారీ హిట్ అందించింది.