BigTV English

Elon Musk Net worth: ట్రంప్ విజయంతో భారీగా పెరిగిన ఎలన్ మస్క్ ఆస్తులు.. ఎన్నికల తరువాత ఏకంగా 70 బిలియన్ డాలర్ల వృద్ధి

Elon Musk Net worth: ట్రంప్ విజయంతో భారీగా పెరిగిన ఎలన్ మస్క్ ఆస్తులు.. ఎన్నికల తరువాత ఏకంగా 70 బిలియన్ డాలర్ల వృద్ధి

Elon Musk Net worth| ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, బిలియనీర్ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఆయన ఇటీవలి కాలంలో చాలా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఎలన్ మస్క్ చేస్తున్న వ్యాపారాలన్నీ సంచలన లాభాలు నమోదు చేస్తున్నాయి. దీనికితోడు ఆయన ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకు పూర్తి మద్దతు ఇచ్చాడు. ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారంలో డబ్బుని నీరులా ఖర్చుపెట్టాడు. ఫలితంగా ట్రంప్ ఎన్నికల్లో భారీ విజయం సాధించాడు. అయితే ట్రంప్ విజయంతో ఇప్పుడు అందరికంటే ఎక్కువగా లాభపడింది ఎలన్ మస్క్.


ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో ఆయనకు మద్దతుగా నిలిచిన మస్క్ కు ప్రభుత్వం అండదండలుంటాయనడంతో సందేహం లేదు. అందుకే ఎన్నికల తరువాత నుంచీ మస్క్ ఆస్తుల విలువ భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకు మస్క్ ఆస్తుల విలువ 70 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ రూ.5 లక్షల 91 వేల కోట్లు) పెరిగింది. దీంతో ఆయన కంటే ప్రపంచంలో ధనవంతుడైన వ్యక్తి ఎవరూ లేరు.

Also Read: కిమ్ జాంగ్‌కు సింహాలు, ఎలుగుబంట్లు, పక్షుల భారీ కానుకలు.. పుతిన్‌తో దోస్తీ మామూలుగా ఉండదు


ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఆయన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఎక్స్ ఎఐ’ షేర్లు కూడా స్టాక్ మార్కెట్‌లో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. మస్క్ రాజకీయం తన ప్రభావం చూపడంతో ఆయన పెట్టుబడులు పెట్టిన పలు వ్యాపారాలు కూడా లాభదాయకంగా సాగుతున్నాయి. దీంతో ఆయన ఆస్తుల విలువ నవంబర్ 22 నాటికి 340 బిలియన్ డాలర్లకు (రూ.28 లక్షల కోట్లకు పైగా)చేరిందని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిపోర్ట్.

నవంబర్ 5 2024న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తరువాత మస్క్ కు రాజకీయం బలం తోడవడంతో స్టాక్ మార్కెట్ లో ఆయన కంపెనీల షేర్ల కొనగోలు జనం ఎగిసిపడ్డారు. దీంతో మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 40 శాతం పెరిగింది.

శనివారం నవంబర్ 22, 2024న స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి మస్క్ నికర ఆస్తుల విలువ 321.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో టెస్లా షేర్లు ఒక్కరోజులో 3.8 శాతం లాభపడ్డాయి. గత 3.5 ఏళ్ల రికార్డ్ చూస్తే.. ఒక్కరోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారి. అయితే నవంబర్ 2021లో ఎలన్ మస్క్ ఆస్తులు 320.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఆ తరువాత క్షీణించింది. ఇప్పుడు ఆయన నెట్ వర్త్ (నికర ఆస్తుల విలువ) 340 బిలియన్ డాలర్లకు చేరింది.

అమెరికాకు చెందిన అంతరిక్షంలో రాకెట్లు లాంచ్ చేసే కంపెనీ స్పేస్ ఎక్స్ కంపెనీకి కూడా ఎలన్ మస్క్ సీఈఓగా ఉన్నారు. ఆయన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఎక్స్ ఎఐ’ షేర్ల ధరలు ఎన్నికల తరువాత రెండింతులు పెరిగి 50 బిలియన్ డాలర్లు చేరుకున్నాయి. ఎక్స్ ఏఐ కంపెనీలో మస్క్ కు 60 శాతం వాటా ఉంది. దీంతో ఆయన ఆస్తిలో 13 బిలియన్ డాలర్లు అదనంగా చేరాయి.

టెస్లాలో ఎలన్ మస్క్ వాటా 13 శాతం వాటా విలువ 145 బిలియన్ డాలర్లు. మరో 9 శాతం వాటా కోసం కోర్టులో కేసు విచారణ సాగుతోంది. అది కూడా నెగ్గితే ఆయన వాటా ఇంకా పెరుగుతంది. స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎలన్ మస్క్ వాటా 42 శాతం ఉంది. దాని విలువ 88 బిలియన్ డాలర్లు.

ఫోర్బస్ పత్రిక రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎలన్ మస్క్ తరువాత ల్యారీ ఎలిసన్ ఉన్నారు. ల్యారీ ఎల్లిసన్ నికర ఆస్తుల విలువ 235 బిలియన్ డాలర్లు. ఈ లెక్కన ల్యారీ ఎల్లిసన్ కంటే మస్క్ వద్ద 80 బిలియన్ డాలర్ల ఆస్తి ఎక్కువగా ఉంది.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×