Allu Arjun :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి మెగా ఫ్యామిలీ అండతో ఇండస్ట్రీలోకి వచ్చారు అల్లు అర్జున్(Allu Arjun).అంతే కాదు ఇదే విషయాన్ని ఆయన స్వయంగా తన తొలి చిత్రమైన ‘గంగోత్రి’ సినిమా నుంచి ‘సరైనోడు’ సినిమా వరకు కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు కూడా.. తాను మెగా హీరో అని, మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు తాను ఫిదా అయ్యాను. మెగా అభిమానుల సపోర్టు వల్లే ఈ స్థాయికి వచ్చాను.. అంటూ కూడా గతంలో ఎన్నో వేదికల మీద బహిరంగంగా తెలిపారు. అంతేకాదు మంచు లక్ష్మీ (Manchu Lakshmi)షోలో చిరంజీవి(Chiranjeevi ), అల్లు అరవింద్(Allu Aravind)ఇద్దరిలో ఎవరంటే ఇష్టం అని రెండు ఆప్షన్స్ ఇస్తే.. క్షణం ఆలోచించకుండా చిరంజీవి అంటేనే ఇష్టం అని చెప్పాడు బన్నీ. అలా బన్నీ చెప్పడం చిరు ,మెగా భజన చేయడం వల్లే మెగా అభిమానులు ఈయనను సొంతం చేసుకున్నారు.
మెగా భజన చేసిన బన్నీ..
అయితే ఏమైందో తెలియదు కానీ సడన్ గా ప్లేట్ మార్చారు బన్నీ . ఒకప్పుడు మెగా హీరోలే నా వాళ్ళు.. మెగా అభిమానులే నా సైన్యం అంటూ మాట్లాడిన బన్నీ ఇప్పుడు మెగా కుటుంబ నామస్మరణ చేయడమే మానేశాడు. అంతేకాదు మెగా ఫ్యాన్స్ ఉన్నారా? అనే విషయం కూడా ఆయనకు గుర్తు లేదేమో అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ముఖ్యంగా అల్లు ఆర్మీ అంటూ తనకు తానే స్టేజ్ ల మీద చెప్పుకుంటూ గొప్పలకు పోతున్నారనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
పాట్నాలో స్టామినా చూపించిన బన్నీ..
ప్రస్తుతం తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో కూడా పాట్నా లాంటి ప్రదేశాలలో ఈవెంట్ పెట్టి లక్షల మంది జనాలను పోగు చేసుకోలేకపోయారు. ఇక పాట్నా ఈవెంట్ తో బన్నీ స్టామినా ఏంటో అందరికీ ఒక్కసారిగా అర్థమైంది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా బన్నీ తన రూట్ మర్చిపోకుండా.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే చిరంజీవి గురించి మెగా అభిమానుల గురించి చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే చెప్పింటే చాలామంది మెచ్చేవారు.
ప్లేట్ మార్చిన బన్నీ.. మెగా ఫ్యాన్స్ ట్రోల్స్..
కానీ గుర్తింపు లభించిన తర్వాత బన్నీ మెగా ఫ్యాన్స్ ని దూరం పెట్టేశారు. తాజాగా పరిస్థితులను బట్టి చూస్తే మెగా ఫాన్స్ ని పూర్తిగా దూరం పెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాను నటిస్తున్న పుష్ప -2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 4 కి గెస్ట్ గా వచ్చారు బన్నీ. ఈ క్రమంలోనే బన్నీ ఇప్పుడు ప్లేట్ మారుస్తూ.. తన తండ్రి తనకు దైవం అని చెబుతున్నారు. ఇందులో తప్పులేదు. ఏ కొడుకు అయినా సరే ఇలాగే చెబుతాడు. కానీ ఒకప్పుడు తన తండ్రి ,చిరంజీవి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా చిరంజీవి పేరు చెప్పిన బన్నీ, ఇప్పుడు తండ్రి పేరు చెప్పడంతో అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి అవసరం ఉంది ,మెగా అభిమానుల అండ కావాలి కానీ సడన్గా ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. నేషనల్ స్థాయిలో అవార్డు కూడా లభించింది. ఇప్పుడు చిరంజీవితో పనేముంది. అందుకే తన తండ్రి తనకు దైవం అంటున్నారు అంటూ మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. అవసరం తీరకముందు ఒక మాట, అవసరం తీరాక ఇంకో మాట అంటూ మెగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పుష్ప -2 విడుదలకు ముందు బన్నీ ఇలాంటి కామెంట్లు చేయడంతో.. ఇప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.