E-Paper
Advertisement

Sarath Babu : హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌ బాబు

Sarath Babu : హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌ బాబు
Advertisement
Sarath Babu

Sarath Babu : టాలీవుడ్‌కి చెందిన సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు అనారోగ్య కార‌ణాల‌తో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఆ విష‌యం వెంట‌నే బ‌య‌ట‌కు రాలేదు. న‌టి కరాటే క‌ళ్యాణి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ త‌న సోష‌ల్ మీడియాలో వార్త‌ను పోస్ట్ చేయ‌టంతో న్యూస్ వైర‌ల్ అయ్యింది. శ‌ర‌త్ బాబు చెన్నైలో నివాసం ఉంటారు. అక్క‌డే సెటిల్ అయిన ఆయ‌న అస్వ‌స్థ‌త‌తో ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో చేరారు. ట్రీట్మెంట్ జ‌రుగుతుంది. ఈ విష‌యం తెలిసిన సినీ ప్ర‌ముఖులు ఆయ‌న్ని ప‌రామ‌ర్శిస్తున్నారు. ‘నాకు ఇష్టమైన హీరో, అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు తొందరగా కోలుకోవాలని మనం స్వామిని వేడుకుందాం శ్రీరామరక్ష’ అంటూ క‌ళ్యాణి త‌న పోస్ట్‌లో పేర్కొంది.

శ‌ర‌త్ బాబు 1951 జూలై 31న ఆముదాల వ‌ల‌స‌లో జ‌న్మించారు. ఆయ‌న వ‌య‌సు 71 సంవ‌త్స‌రాలు. తండ్రి త‌న వ్యాపారాన్ని చూసుకోవాల‌ని శ‌ర‌త్ బాబుని కోరారు. అయితే శ‌ర‌త్ బాబుకి న‌టుడు కావాల‌నే కోరిక లేదు. పోలీస్ ఆఫీస‌ర్ కావాల‌నుకున్నారు. అయితే కంటి చూపు స‌మ‌స్య కార‌ణంగా ఆయ‌న పోలీస్ ఆఫీస‌ర్ కాలేక‌పోయారు. త‌ర్వాత ఆయ‌న సినీ రంగంలోకి అడుగు పెట్టారు. 1973లో విడుద‌లైన రామ‌రాజ్యం ఈయ‌న న‌టించిన తొలి చిత్రం. తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు క‌న్న‌డ, మ‌ల‌యాళ , హిందీ చిత్రాల్లోనూ న‌టుడిగా రాణించారు. హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. 220 చిత్రాల‌కు పైగా న‌టించి మెప్పించిన శ‌ర‌త్ బాబు మూడుసార్లు ఉత్త‌మ స‌హాయ న‌టుడిగా నంది అవార్డుల‌ను కూడా అందుకున్నారు.

Advertisement

సినీ న‌టి ర‌మా ప్ర‌భ‌ను 1974లో వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల త‌ర్వాత 1988లో వీరిద్ద‌రూ విడిపోయారు. త‌ర్వాత రెండేళ్ల‌కు అంటే 1990లో స్నేహా నంబియార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆమెతో 2011లో విడిపోయారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×