BigTV English

NTR 30 : NTR 30లో నాగ‌ చైత‌న్య మ‌ర‌ద‌లు!

NTR 30 : NTR 30లో నాగ‌ చైత‌న్య మ‌ర‌ద‌లు!
NTR 30

NTR 30 : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం NTR 30. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఒక‌వైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. లేటెస్ట్‌గా సినీ స‌ర్కిల్స్‌లో వినిప‌స్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటార‌ట‌. ఇప్ప‌టికే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. దీంతో మేక‌ర్స్ సెకండ్ హీరోయిన్ కోసం బాగానే సెర్చ్ చేశారు. చివ‌ర‌కు శాండిల్ వుడ్ బ్యూటీ కృతి శెట్టిని ఫైన‌ల్ చేశార‌ని టాక్‌.


కృతి శెట్టి ఇప్పుడు నాగ చైత‌న్య‌తో క‌స్ట‌డీ సినిమాలో జోడీ క‌ట్టింది. అంత‌కు ముందు ఆయ‌న‌తోనే బంగార్రాజు చిత్రంలో మ‌ర‌ద‌లి పాత్ర‌లో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ 30లో చాన్స్ కొట్టేసింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో జాన్వీ క‌పూర్ సౌత్‌లో అడుగు పెడుతుంటే.. కృతి శెట్టి నార్త్ ఆడియెన్స్‌కి ప‌రిచ‌యం అవుతున్న‌ట్లే. ఈ సినిమా కోసం కొర‌టాల స్టార్ టెక్నీషియ‌న్స్‌ను రంగంలోకి దించుతున్నారు. ఈ మూవీ కోసం మ‌న ఇండియ‌న్ స్టార్ టెక్నీషియ‌న్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పటికే యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం కెన్నీ బేట్స్ టీమ్‌లో జాయిన్ అయ్యారు. రీసెంట్‌గా గ్రాండియ‌ర్ విజువ‌ల్ ఎఫెక్ట్ కోసం బ్రాడ్ మిన్నెచ్ పార్ట్ అయ్యారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై హ‌రి కృష్ణ‌.కె, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ భారీ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను ఐదు భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.


ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్ లో సెట్‌ అయిన కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. అలాంటి మనుషులను మన యంగ్ టైగర్ ఎలా భయపెట్టాడనేదే కథాంశం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×