BigTV English
Advertisement

Vizag Jagadeeswari: అద్దె కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు.. సీనియర్ నటి ఆవేదన

Vizag Jagadeeswari: అద్దె కట్టుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు.. సీనియర్ నటి ఆవేదన

Vizag Jagadeeswari: వైజాగ్ జగదీశ్వరి.. పేరు వినగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ, చూస్తే మాత్రం ఓ ఈమెనా అని అనేస్తారు. పిల్ల జమీందార్ లో రత్తమ్మ అనే క్యారెక్టర్ తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఎన్నో మంచి సినిమాలో లేడీ విలన్ గా, పని మనిషిగా మంచి పాత్రలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సీరియల్స్ లో చేస్తుంది. అయితే నాటకరంగం నుంచి వచ్చిన ఆమె ప్రస్తుతం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయాన్ని వైజాగ్ జగదీశ్వరి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన కెరీర్ లో పడిన అవమానాలు, గొడవల గురించి మొదటిసారి నోరువిప్పింది.


వైజాగ్ జగదీశ్వరి పేరు ఒకప్పుడు మారుమ్రోగింది. ఆమె డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లె చేస్తుందని పుకారు పుట్టింది. దీంతో చాలామంది అదే నిజమని నమ్మారు. ఇక దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ” అవును.. అలా మాట్లాడుకున్నవారు ఉన్నారు. కానీ, నేను అలా చేసేదాన్ని అయితే.. ఇప్పుడు ఇంటి అద్దె కట్టుకొనే స్తోమత కూడా లేకుండా ఉండేదాన్ని కాదు. అప్పట్లో నేను చాలామంది అమ్మాయిలతో ఆటోల్లో తిరిగేదాన్ని. అందుకు కారణం.. నా చేతిలో డబ్బులు లేక..బోరబండ నుంచి నాకు రూట్స్ తెలియక ఆటోలో అమ్మాయిలతో కలిసి వెళ్లి వచ్చేదాన్ని. దాన్ని చూసినవాళ్లు అమ్మాయిలను సప్లె చేసేదాన్ని అని చెప్పుకొచ్చారు. నేను తప్పు చేశాను అని నిరూపిస్తే నేనే డైరెక్ట్ గా పోలీసులకు వెళ్లి లొంగిపోతాను. నేను ఏ తప్పు చేయలేదు.. ఇలా నల్లగా, బండగా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తున్నాయని చాలామందికి కుళ్లు . అందుకే అలా చేశారు.

ఇక పావలా శ్యామలతో గొడవ.. ఒక నాటకం వేసేటప్పుడు పాత్రలో లీనమై నేను ఏడుస్తుంటే.. ఆమె వెటకారంగా మాట్లాడింది. అప్పటినుంచి ఆమెను నేను మనసులో నుంచి తీసేశాను.. ఎన్నో నాటకాలు వేశాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను. నా మొదటి నంది తీసుకున్నప్పుడు KL విజయలక్ష్మీ.. పందికి నంది వచ్చిందా.. ? అని మాట్లాడింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×