BigTV English

Actress Y Vijaya: రూ. వందల కోట్ల ఆస్తి పై స్పందించిన సీనియర్ నటి..!

Actress Y Vijaya: రూ. వందల కోట్ల ఆస్తి పై స్పందించిన సీనియర్ నటి..!

Actress Y Vijaya.. సీనియర్ నటీమణి వై.విజయ (Y Vijaya ) కెరియర్ ఆరంభంలో ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్(ANR ), శోభన్ బాబు (Shobhan Babu) వంటి అగ్ర హీరోల సినిమాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ టర్న్ తీసుకున్న ఈమె ఇప్పటికీ కూడా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘చేపల పులుసు’ అంటూ ఈమెను అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు. ముఖ్యంగా పాతతరం అభిమానులు ఈమెకు ఎక్కువ మంది ఉన్నారు.


పులుసు అనే పేరుతో భారీ పాపులారిటీ..

‘మా పల్లెలో గోపాలుడు’,’ ముద్దుల కృష్ణయ్య’, ‘మంగమ్మగారి మనవడు’ వంటి సినిమాలలో “చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి “అని చెప్పుకునే పాత్రలో కనిపించి, అదే పేరుతో ఆమె ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయి గా నిలిచిపోయారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళ్ , మలయాళం భాషల్లో కూడా నటించారు. ఇండస్ట్రీకి సంబంధించి 80వ దశకం లోనే వెయ్యికి పైగా సినిమాలలో నటించిన నటీమణులలో వై. విజయ కూడా ఒకరు అని చెప్పవచ్చు.


వందల కోట్ల ఆస్తిపై క్లారిటీ..

ఇక ఇటీవల కాలంలో తెనాలి రామకృష్ణ బీఏ ఎల్ ఎల్ బి, వెంకటేశ్ (Venkatesh ),వరుణ్ తేజ్(Varuntej ) కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్2’ , ‘ఎఫ్3’ సినిమాలలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. ఇకపోతే కొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకుంది. అలాగే వందల కోట్ల ఆస్తికి అధిపతిరాలు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా వై విజయ మాట్లాడుతూ..” చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. కెరియర్ ఆరంభంలోనే హీరోయిన్ గా చేసి ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాను. ‘మా పల్లెలో గోపాలుడు’ నేను చేసిన పులుసు పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. ఆ సినిమా తర్వాత మా ఇంట్లో ఫోన్ అలా మోగుతూనే ఉండేది. రోజుకి కనీసం ఒక ఐదు ఆఫర్లైనా వచ్చేవి. ఆ ఏడాది నేను చేసిన సినిమాల సంఖ్య కూడా ఎక్కువే. అలా ఆ సినిమాలతో వచ్చిన డబ్బుతో నేను చెన్నైలో స్థలం కూడా కొన్నాను. ఇల్లు కట్టాను . సినిమాల సంఖ్య పెరిగింది. కానీ నా పారితోషకం పెరగలేదు. నేను వందల కోట్లు సంపాదించి ఉంటానని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదు. కేవలం స్థిరాస్తులు సంపాదించుకున్నాను. డబ్బుకు మాత్రం ఇబ్బంది లేదు అంటూ వై విజయ తెలిపింది.

నిర్మాతల మనిషిగా గుర్తింపు..

ఇకపోతే అప్పట్లో వై విజయ నిర్మాతల మనిషిగా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఏ రోజు కూడా నిరాడంబరాలకు వెళ్లలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది . ఈ మధ్యకాలంలో తన తోటి నటి అన్నపూర్ణమ్మతో కలిసి పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది వై విజయ. మొత్తానికి అయితే వందల కోట్లకి అధిపతిరాలు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×