Kalki 2898AD: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈ పేరు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మనకు మరో పేరు ఉంది.. అదే బాక్సాఫీస్ కా బాద్షా. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. నాకు నేనే పోటీ.. నాకు నాతోనే పోటీ అని. అది అక్షరాలా ప్రభాస్ కు వర్తిస్తుంది. ఒక సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం అందరికి వచ్చు.. కానీ, ప్రతిసారి అదే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ప్రభాస్ కే వచ్చు.
ఇప్పటివరకు బాక్సాఫీస్ చరిత్రలోనే రూ. 500 కోట్లు దాటిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో 4 సినిమాలు ప్రభాస్ వే ఉండడం విశేషం. ఇక ఇప్పుడు ప్రభాస్ మరో సినిమా ఆ లిస్ట్ లో చేరింది. అదే కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రేంజ్ హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మైథలాజికల్ కు సైన్స్ ఫిక్షన్ ను యాడ్ చేసి నాగీ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కల్కి రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా .. అక్షరాలా రూ. 900 కోట్ల కలక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇలాగే కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో కల్కి రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని చెప్పొచ్చు. ఎంతైనా బాక్సాఫీస్ ను ఇలా ఢీ కొట్టాలంటే డార్లింగ్ తరువాతనే ఎవరైనా.. ? అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.