BigTV English

Hair Dye: జుట్టుకు రంగు వేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

Hair Dye: జుట్టుకు రంగు వేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

Hair Dyeing Side Effects: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కాలుష్యంతో పాటు వివిధ కారణాల వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం, జుట్టు నల్లగా కనిపించడం కోసం జుట్టుకు కలర్స్ వాడుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు ఫ్యాషన్ పేరుతో రకరకాల కలర్లను జుట్టుకు వేసుకుంటున్నారు. అయితే ఇలా జుట్టుకు రంగు వేసుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. కానీ తరచూ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రంగుతో సైడ్ ఎఫెక్ట్స్:
పొడిగా మారుతుంది:
జుట్టుకు రంగు వేయడం వల్ల హెయిర్‌ నాచురల్ కయిల్స్ తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టు సాధారణ రంగు దెబ్బతింటుంది. అంతే కాకుండా అందులోని కెమికల్స్ ఆరోగ్యానికి హాని కలగజేస్తాయి.
పెలుసుగా మారడం:
హెయిర్ కలర్స్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయట. దీని వల్ల జుట్టు పెలుసుగా మారి తెగిపోతుంది. అంతే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చికాకు, అలర్జీ:
దాదాపు మార్కెట్లో దొరికే చాలా హెయిర్ కలర్స్‌లో కెమికల్స్ ఉంటాయి. కొంత మందికి ఈ కెమికల్స్ పడకపోవచ్చు. ఇలాంటి వారి జుట్టుకు రంగు వేయడం వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, వాపు, అలర్జీల వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2007లో కాంటాక్ట్ డెర్మటాలజిస్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం కొంతమందికి హెయిర్ కలర్స్‌లోని కెమికల్స్ వల్ల చికాకు, అలర్జీ వంటి సమస్యలు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డెర్మటాలజిస్టులు పాల్గొన్నారు. ఎక్కువగా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల కొంతమందిలో చికాకు, అలర్జీ వంటివి వస్తాయని వెల్లడించారు.
శ్వాసకోశ సమస్యలు:
హెయిర్ కలర్స్‌లో అమ్మోనియాతో పాటు అనేక కెమికల్స్ ఉంటాయి. దీనివల్ల కొందరిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కలర్ వేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.


Also Read: డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

క్యాన్సర్ ప్రమాదం:
తరుచుగా హెయిర్ కలర్స్ వాడడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హెయిర్ కలర్స్ వేసుకునే ముందు ఆలోచించడం మంచిది. వీలైనంతవరకు హెయిర్ కలర్స్ వాడకుండా న్యాచురల్ ఉండటానికి ప్రయత్నించండి. అత్యవసరం అయితే హోం రెమిడీస్ వాడి కెమికల్స్ లేకుండా జుట్టు రంగులను తయారు చేసుకోవచ్చు.


Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×