Star Heros : ఇటీవల కాలంలో టాలీవుడ్ మూవీలకు సీక్వెల్స్ వస్తున్నాయి. ఒక సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ టాక్ ని అందుకుంటే ఆ సినిమాకి తప్పకుండా సీక్వెల్ గా మరో సినిమాని తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు సీక్వెల్ మూవీలు కేవలం బాలీవుడ్ కే పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా సీక్వెల్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. సౌత్ లో గత రెండు మూడేళ్లుగా సీక్వెస్ట్ సినిమాలు ఎక్కువయ్యాయి. స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలను సగం సగం కథతో రెండు పాటలుగా తీసి జనాలకు అందిస్తున్నారు. బాహుబలి సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా పుష్ప 2 కూడా మంచి టాక్ ని అందుకుంది. ఇప్పుడు దేవర 2 పార్ట్-2 తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ఏడాదిలో ఎన్ని సినిమాలు సీక్వెల్ గా రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. కోలీవుడ్ నుంచి అయితే? సీక్వెల్స్ బాలీవుడ్ పంథాలోనే కనిపిస్తున్నాయి. ‘జైలర్’ కి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ -2’ ప్రకటించిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన జైలర్ మంచి హిటాక్ ని అందుకున్న సందర్భంగా జైలర్ పార్ట్ 2 ఉంటుందని అప్పుడే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది రజినీకాంత్ కు అనారోగ్య సమస్యలు వెంటాడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జైలర్ 2 మొదలుపెట్టినట్లు వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
మరోవైపు శంకర్ కమలహాసన్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 3 మూవీ రెడీగా ఉంది ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు కోలీవుడ్ మరోవైపు శంకర్ కమలహాసన్ కాంబోలో వచ్చిన ఇండియన్ టు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ త్రీ సినిమా రెడీగా ఉంది ఆ సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు కోలీవుడ్ లో టాక్.. అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన సర్దార్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ మూవీ పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే.. ఇక ఖైదీ-2 ని కూడా ఇదే ప్రారంభించాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నాడు. సూర్య హిట్ ప్రాంచైజీ ‘సింగం ‘గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు సిరీస్ వచ్చిన ఈ సినిమా సింగం ఫోర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి 2025 ఏడాది మరిన్ని సీక్వెల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.. మొత్తానికి ఈ ఏడాది సీక్వెల్ సినిమాలకు సమరమే..