BigTV English

OTT Movie : అప్పుకట్టలేదని వేశ్యని చేయాలనుకుంటే… పొలిటికల్ లీడర్ ప్రెగ్నెంట్ చేశాడు

OTT Movie : అప్పుకట్టలేదని వేశ్యని చేయాలనుకుంటే… పొలిటికల్ లీడర్ ప్రెగ్నెంట్ చేశాడు

OTT Movie : కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరాఠీ ఇండస్ట్రీనుంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భార్య, భర్త, ప్రియురాలు చుట్టూ మూవీ తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మరాఠీ మూవీ పేరు ‘చంద్రముఖి‘ (Chandramukhi). 2022లో విడుదలైన ఈ మరాఠీ మూవీకి  ప్రసాద్ ఓక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో  ఆదినాథ్ కొఠారే, మృణ్మయి దేశ్‌పాండేతో, అమృతా ఖాన్విల్కర్ నటించారు. ఈ మూవీ 29 ఏప్రిల్ 2022న థియేట్రికల్‌గా విడుదలైంది. ఇది విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

దౌలత్ ఒక రాజకీయ నాయకుడిగా ఉంటాడు. ఇతనికి డాలి అనే భార్య కూడా ఉంటుంది. హ్యాపీగా సాగిపోతున్న వీరి సంసారంలో చంద్రముఖి ఎంటర్ అవుతుంది. ఈమెను దౌలత్కి ఇతని బాబాయ్ పరిచయం చేపిస్తాడు. అప్పటినుంచి చంద్రముఖితో సన్నిహితంగా ఉంటాడు దౌలత్. నిజానికి చంద్రముఖి ఒక వేశ్య గృహంలో డాన్సర్ గా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల చేసిన అప్పు ఎక్కువగా ఉండటంతో, చంద్రముఖిని అప్పిచ్చినవాడు సొంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే నానా అనే వ్యక్తి ఆమె తల్లిదండ్రులకు  డబ్బులు ఇచ్చి, చంద్రముఖిని వేశ్య గృహానికి తీసుకువెళ్తాడు. అయితే ఆమె ఆ వృత్తిని చేయకుండా ఉండటంతో, అక్కడున్న వాళ్లు నృత్యం చేయడానికి అంగీకరిస్తారు. ఎందుకంటే నృత్యం చేసినవాళ్లు తమకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అలా ఉంటున్న ఈమెకు దౌలత్ దగ్గర అవుతాడు. ఆమె స్టోరీ ని తెలుసుకొని బాధపడతాడు. ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం భార్యకు తెలిసి బాధపడుతుంది.

ఒకరోజు చంద్రముఖితో దౌలత్ గెస్ట్ హౌస్ లో ఉండగా భార్య కూడా అక్కడికి వెళుతుంది. ఇద్దరినీ ఒకేసారి చూడటంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు చంద్రముఖిని పట్టించుకోకుండా, భార్యని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు దౌలత్. అప్పుడు చంద్రముఖి తనకన్నా దౌలత్ కి భార్య మీద ఎక్కువ ప్రేమ ఉందని తెలుసుకొని, అతడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటుంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న ఒక ఫోటో బయటకి వస్తుంది. పత్రికలో కూడా రావడంతో దౌలత్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. దౌలత్ బాబాయ్ అతనిని అనవసరంగా ఇరికిస్తాడు. అక్కడికి వచ్చిన చంద్రముఖి అందులో ఉన్నది నేను కాదని చెబుతుంది. ఆ తర్వాత దౌలత్ భార్య అందులో ఉన్నది నేనే అని మీడియాకి చెప్తుంది. ఈ ప్రాబ్లం నుంచి దౌలత్ బయటపడతాడు. చివరికి చంద్రముఖి దౌలత్ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అప్పటికే ఆమె దౌలత్ వల్ల గర్భవతి గా ఉంటుంది. చివరికి దౌలత్ ఎవరితో లైఫ్ని గడుపుతాడు? చంద్రముఖి నిజంగానే అతని జీవితం నుంచి వెళ్ళిపోతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×