Big Stories

Rohit Sharma Interview: నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను: కెప్టెన్ రోహిత్ శర్మ..!

Rohit Sharma Radio Interview: నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను. ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఒక రేడియో సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ ఇండియాలో తన ప్రస్థానం అంత సాఫీగా ఏమీ జరగలేదని అన్నాడు. ఇప్పటికి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, భారతజట్టుకి తాను కెప్టెన్ గా ఉంటానని అస్సలు అనుకోలేదని అన్నాడు.

- Advertisement -

కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపాడు. చివరి జట్టులో స్థానం కోసం నేను కూడా చాలాకాలం ఎదురుచూశానని అన్నాడు. ప్రతీసారి నిరూపించుకోవడమే, అదొక ఛాలెంజ్ గా ఉండేదని అన్నాడు. చాలా కాలం టెస్ట్ క్రికెట్ లో అవకాశాలే రాలేదని అన్నాడు. జట్టులో ఒక స్థిరమైన ఆటగాడు, ఒక నమ్మదగ్గ ఆటగాడు అనే ముద్రని వేయలేకపోయానని అన్నాడు.

- Advertisement -

ఆ సమయంలో ఒకొక్క సారి నేను అంతర్జాతీయ క్రికెట్ కి అర్హుడినేనా? అని అనిపించేదని అన్నాడు. ఇక చెప్పాలంటే భారత జట్టుకి కెప్టెన్ అవుతానని కలలో కూడా ఊహించలేదని తెలిపాడు. నిజంగా ఇది ఒక గౌరవంగా భావిస్తానని తెలిపాడు. అది మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందని తెలిపాడు. అంతేకాదు అది ఒక బలం, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిపాడు.

Also Read: ప్లే ఆఫ్ కి వెళ్లే జట్లు ఇవే: హర్భజన్ సింగ్

ఒకసారి మా రోజుల్లోకి వెళితే.. ఇప్పటిలా ఐపీఎల్ క్రికెట్ లేదు, అంతా రంజీలు, దులీప్ ట్రోఫీలు, స్టేట్ జట్లకు, లోకల్ మ్యాచ్ లు ఆడేవాళ్లం. ఈ క్రికెట్ మ్యాచ్ లకి మీడియాలో అంతగా కవరేజ్ ఉండేది కాదు. అందువల్ల మాగురించి పెద్దగా తెలిసేది కాదు. ఎంతో గొప్పగా ఆడితే, చిన్న వార్త రాసేవారు. ఆ పేపరు కటింగులు పట్టుకుని, ఒక ఫైల్ లో పెట్టుకుని తిరిగేవాళ్లమని తెలిపాడు.

తెల్లవారుజామునే 4 గంటలకు లేవడం, గ్రౌండుకి పరుగులెట్టడం, ప్రాక్టీస్, ప్రాక్టీస్…ఇలాగే బాల్యం నుంచి నేటి వరకు జీవితం గడిచిపోయిందని అన్నాడు. 17 ఏళ్లుగా జాతీయ జట్టులో క్రికెట్ ఆడుతున్నాను. ఇంకా కొన్నాళ్లు ఆడాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. చివరిగా మాట్లాడుతూ జీవితంలో సుఖాలకన్నా, కష్టాలే ఎక్కువ చూశానని అన్నాడు. ఇప్పుడు యువతరం ఇవన్నీ గమనించాలని అన్నాడు. సక్సెస్ ఎప్పుడూ సులువుగా రాదని తెలిపాడు. ఆ మార్గంలో ఎన్నో ముళ్ల దారులు ఉంటాయని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News